Vallabhaneni Vamsi: వల్లభనేని వంశీ బెయిల్ పిటిషన్ విచారణ వాయిదా.. పోలీసులకు కీలక ఆదేశాలు
- నూజివీడు కోర్టులో వల్లభనేని వంశీ బెయిల్ పిటిషన్ పై విచారణ..
- నకిలీ పట్టాల పంపిణీ కేసులో బెయిల్ పిటిషన్ వేసిన వంశీ..
- కౌంటర్ దాఖలు చేయాలని పోలీసులను ఆదేశాలు..
- విచారణ రేపటికి వాయిదా వేసిన కోర్టు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vallabhaneni Vamsi: గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత వల్లభనేని వంశీ మోహన్‌కు.. కొన్ని కేసుల్లో బెయిల్, ముందస్తు బెయిల్ వచ్చినా.. ఇంకా జైలులోనే మగ్గాల్సిన పరిస్థితి వచ్చింది.. అయితే, నకిలీ పట్టాల పంపిణీ కేసు వ్యవహారంలో వంశీ బెయిల్ పిటిషన్ పై నేడు ఏలూరు జిల్లా నూజివీడు కోర్టులో విచారణ జరిగింది.. నకిలీ పట్టాల పంపిణీ కేసులో తనకు బెయిల్ ఇవ్వాలంటూ వల్లభనేని వంశీ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ చేపట్టింది.. కౌంటర్ దాఖలు చేయాలని పోలీసులను కీలక ఆదేశాలు జారీ చేసింది నూజివీడు రెండవ అదనపు జూనియర్ సివిల్ జడ్జీ కోర్టు.. ఆ తర్వాత వల్లభనేని వంశీ మోహన్ బెయిల్ పిటిషన్‌పై విచారణను రేపటికి వాయిదా వేసింది కోర్టు.. కాగా, ప్రస్తుతం గన్నవరం నియోజకవర్గంలో నకిలీ పట్టాల పంపిణీ వ్యవహారంలో విజయవాడ సబ్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు వల్లభనేని వంశీ మోహన్.. ఆయన్ని మొదట అరెస్ట్ చేసిన కిడ్నాప్ కేసు, ఆ తర్వాత గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసు.. ఇలా అన్ని కేసుల్లో బెయిల్, ముందస్తు బెయిల్ వచ్చినా.. ఇప్పుడు నకిలీ పట్టాల పంపిణీ కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు వల్లభనేని వంశీ మోహన్..
Read Also: Top Headlines @1PM : టాప్ న్యూస్
Also Read
- Chandrababu on Mega DSC: డీఎస్సీపై వైసీపీ ఆందోళనలకు చంద్రబాబు కౌంటర్.. కీలక వ్యాఖ్యలు
- CM Chandrababu: వైసీపీపై సీఎం చంద్రబాబు ఫైర్.. గంజాయి, రౌడీయిజంపై సంచలన వ్యాఖ్యలు
- Nuzvid Love Marriage Twist: ప్రేమ వివాహం తర్వాత ట్విస్ట్.. భార్యను అప్పగించేందుకు రూ.12 లక్షలు డిమాండ్?
- Polavaram Agency: ఏజెన్సీలో ఇంకా డోలీ మోతలే.. 4 కొండలు దాటి బాలికను మోసుకెళ్లిన గిరిజనులు
తాజావార్తలు
-
The Paradise: ప్యారడైజ్ సినిమా కోసం ఎన్ని టన్నుల రక్తం వాడారో తెలుసా.?
-
India Matches: రేపు భారత్‌కు డబుల్ ధమాకా.. అఫ్గాన్‌తో పురుషుల జట్టు.. శ్రీలంకతో మహిళల టైటిల్ పోరు.!
-
Breakup: బ్రేకప్ తర్వాత కొన్ని రోజులకే ప్రేమ పుడుతుందా?
-
Suriya vs SK : సూర్య, శివకార్తీకేయన్ మధ్య సైలెంట్ ట్వీట్ వార్
-
Sabita Indra Reddy: తెలంగాణలో లా అండ్ ఆర్డర్ ఉందా? మాక్ అసెంబ్లీలో సబితా ఇంద్రారెడ్డి ప్రశ్నల వర్షం..
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!