AP Crime: మహిళతో సహజీవనం చేస్తున్నాడు ఓ వ్యక్తి.. ఈ సమయంలో.. సదరు మహిళ కూతురుపై కన్నేశాడు.. దీంతో, నీ కుమార్తెను నాకు ఇచ్చి పెళ్లి చేయాలంటూ ఆమెను వేధించసాగాడు.. మహిళతో సహజీవనం చేస్తూ.. ఆమె కుమార్తెన తనకిచ్చి పెళ్లి చేయాలని వేధింపులకు గురిచేస్తున్న వ్యక్తిపై బాధితురాలు తూర్పుగోదావరి జిల్లా అనపర్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Read Also: Chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్.. 20 మంది మావోల హతం.. మృతుల్లో అగ్రనేత!
పూర్తి వివరాల్లోకి వెళ్తే.. అనపర్తి మండలంలోని ఓ గ్రామానికి చెందిన వివాహిత భర్త 2016లో మృతిచెందారు. తరువాత అదే గ్రామానికి చెందిన పి. నాగిరెడ్డి అనే వ్యక్తితో ఆమెకు పరిచయం ఏర్పడింది.. అదికాస్తా సహజీవనానికి దారితీసింది.. ఇక, తల్లిపై మోజు తీరడంతో ఆ తర్వాత ఆమె కుమార్తెపై కన్నేశాడు నాగారెడ్డి.. నీ కుమార్తెను వివాహం చేసుకుంటానని సదరు మహిళలను వేధిస్తున్నాడు. నాగిరెడ్డికి ఇంతకు మందే మరో యువతితో వివాహం అయ్యింది. బిడ్డ కూడా జన్మించింది.. తర్వాత భార్యా బిడ్డలను వదిలేసిన నాగిరెడ్డి.. గతంలో సహజీవనం చేసిన మహిళ వద్దకు మళ్లీ వచ్చి ఆమె కుమార్తెతో పెళ్లి జరిపించాలంటూ వేధించసాగాడు.. పలుమార్లు ఆ మహిళ, ఆమె కుమార్తెపై చేయి చేసుకున్నాడు.. ఇక, వేధింపులు ఎక్కువ కావడంతో పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది బాధితురాలు.. స్టేషన్ వద్ద నాగిరెడ్డి.. నాపై, నా కుమార్తెపై దాడిచేసి తీవ్రంగా కొట్టిండని బాధితురాలు వాపోయింది.. అపస్మారక స్థితిలో ఉన్న కుమార్తెను అనపర్తి ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో చేర్పించానని బాధితురాలు తెలిపారు. బాధితురాలి ఫిర్యాదుపై కేసు నమోదు చేస్తామని అనపర్తి పోలీసులు పేర్కొన్నారు.