Spy Jyoti Malhotra: పాకిస్తాన్‌కు గూఢచర్యం చేశారనే ఆరోపణలతో యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాను పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే, జ్యోతి మల్హోత్రా వ్యక్తిగత డైరీని పోలీసులు హస్తగతం చేసుకున్నారు. ఆమె ఎక్కడికి వెళ్లినా కూడా వాటిని ఆ డైరీలో రాస్తుంటుంది. పాక్ వెళ్లినప్పుడు ఏం జరిగిందనే విషయాలు కూడా అందులో రాసి ఉంటుందని పోలీసులు భావించి ఆమె వ్యక్తిగత డైరీని స్వాధీనం చేసుకున్నారు. ఆ డైరీలో తన పర్యటనలు అన్నింటి గురించి కూడా రాసుకొచ్చినట్లు తెలిపారు. ఇంగ్లీషు, హిందీలో ఆమె తన పర్యటన అనుభవాలను పంచుకుంది. కానీ, డైరీలో ఆమె ఆచితూచి రాసినట్లుగా పోలీసులు చెబుతున్నారు.
Read Also: Devanand: ఇది కదా సక్సెస్ అంటే.. మృత్యువును జయించి.. నేడు ఐఎఫ్‌ఎస్ అధికారిగా
అయితే, పాకిస్తాన్ పర్యటన నుంచి తిరిగి వచ్చిన తర్వాత ఆమె తన డైరీని ఇంగ్లీషులో కాకుండా హిందీలో రాసినట్లు పోలీసులు చెప్పుకొచ్చారు. పాక్ పర్యటనలో 10 రోజులు పూర్తి అయిన తర్వాత సొంత దేశమైన భారత్‌కు తిరిగి వచ్చాను అని అందులో పేర్కొనింది. ఈ సరిహద్దులు ఎప్పటి వరకు ఉంటాయో తెలీదు.. కానీ, హృదయాల మనో వేదనలు మాయమైతాయి.. మనమందరం ఒకే భూమికి, ఒకే నేలకి చెందిన వారమని తన డైరీలో జ్యోతి మల్హోత్రా రాసుకుంది. అయితే, పాక్ ఆతిథ్యం బాగుందని ఆమె తన డైరీలో ప్రశంసించింది. అలాగే, అక్కడ దేవాలయాలు, గురు ద్వారాలు లాంటి మతపరమైన ప్రదేశాలు చాలా బాగున్నాయి.. వీటిని అందరూ కూడా ఈజీగా చేరుకోవచ్చని పేర్కొనింది. దేశ విభజన సమయంలో విడిపోయిన కుటుంబాలతో మళ్లీ తిరిగి కలవాలనే కోరిక ఉందని కూడా డైరీలో ప్రస్తావించిందని పోలీసులు వెల్లడించారు.
YouTuber Jyoti Malhotra | Jyoti Malhotra | Operation Sindoor – यूट्यूबर ज्योति मल्होत्रा की डेयरी के पन्नों से खुले क्या-क्या राज? आप भी जान लें #Ghaziabad365https://t.co/z7e2djnZhn
— Ghaziabad365 (@Ghaziabad365) May 20, 2025