Terror Bid Foiled: భారీ పేలుళ్ల కుట్ర భగ్నం.. సిరాజ్ నుంచి కీలక సమాచారం సేకరించిన పోలీసులు
- భారీ పేలుళ్ల కుట్రను భగ్నం చేసిన ఏపీ, తెలంగాణ పోలీసులు..
- ఉగ్రవాద భావజాలం కలిగిన సిరాజ్ నుంచి కీలక సమాచారం సేకరణ..
- నాలుగు టార్గెట్‌లు పెట్టుకున్నట్టు పోలీసులకు వెల్లడి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Terror Bid Foiled: దేశవ్యాప్తంగా భారీ పేలుళ్ల కుట్రను తెలంగాణ, ఏపీ పోలీసులు భగ్నం చేసిన విషయం విదితమే.. విజయనగరంలో ఒకరిని, హైదరాబాద్‌లో మరొకరని అరెస్ట్ చేశారు పోలీసులు.. ఈ కేసులో ఎన్‌ఐఏ కూడా రంగంలోకి దిగింది.. ఇప్పటికే రిమాండ్ రిపోర్ట్‌లో విస్తుపోయే విషయాలు వెలుగు చూడగా.. ఉగ్రవాద భావజాలం కలిగిన సిరాజ్ నుంచి అనేక ఆసక్తికర విషయాలు సేకరించారు పోలీసులు.. సిరాజ్ నాలుగు టార్గెట్‌లు పెట్టుకున్నట్టు పోలీసులకు వెల్లడించినట్టు సమాచారం.. దేశాన్ని ఇస్లామిక్ దేశంగా మార్చాలి.. యువతను మతోన్మాదులుగా మార్చాలి.. అవసరమనుకుంటే ప్రాణ త్యాగానికైన సిద్దపడేలా మానవ బాంబుగా మార్చాలని.. అలాగే ఉనికిని చాటుకునేలా జనసాంధ్రత ఎక్కువగా ఉన్నచోట భారీ పేలుళ్లు చేయాలని టార్గెట్‌గా పెట్టుకున్నట్టుగా చెప్పాడట.. సిరాజ్ హైదరాబాద్ వెళ్లిన తరువాత గ్రూప్స్, ఎస్సై ఎంపిక పరీక్షలకు హాజరయ్యడు.. ఎస్సై కోసం రెండు సార్లు హాజరుకాగా ఎంపిక కాలేదు.. తరువాత కాలంలో ఓ కాల్ సెంటర్ లో పని చేశాడు.. అప్పుడే సమీర్ తోపాటు వరంగల్ కు చెందిన పలువురు మత పెద్దలతో పరిచయాలు ఏర్పడ్డాయి.. తరచూ జీహాద్ గురించి చర్చించుకునే వారు.. మనం ఎలా అనిచివేయబడుతున్నామో అన్న వాటిపై నెట్‌లో వీడియోలు ఎక్కువగా చూస్తుండేవాడని తెలుస్తోంది.
Read Also: Maharashtra: ఫడ్నవిస్ కేబినెట్‌లోకి 77 ఏళ్ల కురు వృద్ధుడు.. నేడు ప్రమాణం చేయనున్న భుజ్‌బాల్
Also Read
- Bollaram Incident: ఉద్యోగంలో నుంచి తీసేశాడని కక్ష.. చిన్నారి కిడ్నాప్, హత్య..
- Maharashtra: పెళ్లి నిశ్చయం.. ప్రియురాలిని లోయలోకి తోసిచంపిన ప్రియుడు..
- Instagram Love: ఇన్స్టాగ్రామ్ లవ్.. హిందు వివాహం.. భర్త ముస్లిం అని తెలిసి షాక్!
- Operation Firewall 2026: పాక్ ఇంటెలిజెన్స్‌తో నేరుగా టచ్.. ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ దర్యాప్తులో సంచలన అంశాలు..
ముస్లిమేతరులు మహిళలను ప్రేమ పేరుతో ఎలా మోసగించబడుతున్నారు.. దీనిని అందరికీ తెలియ పరిచే విధంగా ఓ గ్రూప్ నడపాలని డిసైడ్ అయ్యాడు సిరాజ్.. అహిం పేరుతో గ్రూప్ ఏర్పాటు చేసి ముఖ్యలను చేర్చుకుంటూ వచ్చాడు.. తరువాత ఈ ఏడాది తొలిలో సిరాజ్ ఢిల్లీ వెళ్లాడు… అక్కడ ఇద్దరు మత పెద్దలను కలవాల్సి ఉండగా.. వాళ్లు రాకపోయే సరికి తిరిగి వచ్చేశాడు. అలాగే మహారాష్ట్ర, ఉత్తరప్రదేష్ ప్రాంతాలలో కూడా సిరాజ్ వెళ్లి పలు కార్యక్రమాలలో పాల్గొన్నాడు. సిరాజ్ కి సౌదీలో ఉన్న బీహారీలతో పరిచయం ఏర్పడింది.. అక్కడ నుంచే అన్ని డైరెక్షన్స్ సిరాజ్ రావడం మొదలయ్యాయి.. వీరంతా సిగ్నల్ యాప్ ద్వారా కమ్యూనికేట్ అవుతూ వచ్చారు.. సిగ్నల్ యాప్ కాల్స్ చేసుకుంటూ ప్రణాళికలు రూపొందించారు.. పేలుళ్లకు సరిపడ ముడి సరుకు కొనుగోలు చేసేందుకు సిరాజ్ కు అక్కడ నుంచే డబ్బులు రావడం.. సిరాజ్ బాంబులు తయారీ చేయడం.. వాటి వినియోగంపై ఎప్పటికప్పుడు పై నుంచి ఆదేశాలు వచ్చాయని తెలిపినట్టుగా సమాచారం..
Read Also: Dadi Veerabhadra Rao: మాజీ మంత్రి తీవ్ర వ్యాఖ్యలు.. వారిని ఉరితీసినా తప్పులేదు..
అయితే వీటన్నింటికీ విజయనగరం సేప్ అని భావించాడట సిరాజ్.. పేలుడు పదార్ధాలను రెండు ఆన్ లైన్‌లో కొనుగోలు చేశాడు.. అలాగే విజయనగరం కేల్ పురంలో క్రాకర్స్ షాపు నుంచి పేలుడు పదార్ధాలను సేకరించాడు.. అల్యూమినియం, పొటాషియం నైట్రేట్, సల్ఫర్ ను కొని తన గ్రూప్ హౌస్ లోని కింది బాత్ రూమ్ లో పెట్టుకున్నాడట సిరాజ్.. ఇలా సిరాజ్ నుంచి కీలక, ఆస్తికరమైన. భయంకరమైన నిజాలను పోలీసులు రాబట్టినట్టుగా తెలుస్తోంది.. ఇక, ఎన్ఐఏ రంగంలోకి దిగిన తర్వాత.. మరెన్ని విస్తుపోయే విషయాలు వెలుగు చూడనున్నాయో చూడాలి మరి..
తాజావార్తలు
-
AA 23 Update: రూమర్లకు ఒకే ఫోటోతో చెక్.. ‘AA 23’పై లోకేష్ కనగరాజ్ క్లారిటీ చూశారా!
-
Harish Rao : ఎల్ నినో పేరుతో ప్రభుత్వం కాలక్షేపం చేస్తోంది
-
Navratri 2026: నవరాత్రుల్లో డిజిటల్ ఫాస్టింగ్ అంటే ఏమిటి? మొబైల్‌కు దూరంగా ఉంటే ఆరోగ్యానికి ప్రయోజనాలివే
-
Kerala Assembly: సీఈసీ జ్ఞానేశ్ కుమార్ తొలగింపునకు కేరళ అసెంబ్లీ తీర్మానం.. అసలు కారణాలివే
-
Rupee vs Dollar: RBI 4 కీలక నిర్ణయాలు.. డాలర్‌తో పోలిస్తే 97 పైసలు బలపడిన రూపాయి!
ట్రెండింగ్
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!