Techie Suicide: ఓలా యొక్క ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) విభాగంలోని క్రుట్రిమ్‌లో పని చేస్తున్న యువ ఇంజనీర్ మే 8వ తేదీన తీవ్రమైన పని ఒత్తిడి కారణంగా ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ పోస్ట్ రెడ్డిట్ లో వైరల్ కావడంతో ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది. అయితే, కంపెనీలో పని సంస్కృతి గురించి అనేక ప్రశ్నలను లేవనెత్తింది. వివరాల్లోకి వెళితే.. నిఖిల్ సోమవంశీగా గుర్తించబడిన ఆ ఉద్యోగి ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (IISc) నుంచి ఇటీవల గ్రాడ్యుయేట్ పూర్తి చేసుకున్నాడు. 10 నెలల క్రితమే క్రుత్రిమ్‌లో చేరాడు. అతడు మానసిక ఆరోగ్య సమస్యలను చూపుతూ తన మరణానికి రెండు వారాల ముందు ఆఫీసుకు రావడం మానేశాడని ఓలాలో పని చేస్తున్న ఓలా క్రుట్రిమ్ ప్రతినిధి ధృవీకరించారు. అత్యంత ప్రతిభావంతులైన యువ ఉద్యోగులలో ఒకరైన నిఖిల్ విషాదకరంగా మరణించడం మాకు చాలా బాధ కలిగించింది అన్నారు. ఈ కష్ట సమయంలో అతని కుటుంబం, స్నేహితులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నామని పేర్కొన్నారు.
అయితే, క్రుత్రిమ్‌లో పని సంస్కృతి చాలా దారుణంగా ఉంటుంది. కీలకమైన ప్రాజెక్ట్‌ను నిర్వహిస్తున్న ముగ్గురు సభ్యుల బృందంలో నిఖిల్ కూడా భాగం. మిగతా ఇద్దరు సభ్యులు నిష్క్రమించిన తర్వాత మొత్తం పనిభారం అతనిపై పడింది.. దీంతో అతను వర్క్ తొందరగా కంప్లీట్ కావడం లేదంటూ సీనియర్ మేనేజర్ రాజ్‌కిరణ్ తరుచూ ఉద్యోగులను, ముఖ్యంగా ఫ్రెషర్లను తిట్టాడని మాజీ ఉద్యోగి ఆరోపించారు. రాజ్‌కిరణ్‌కు నిర్వహణ నైపుణ్యాలు లేవు.. నిత్యం ఉద్యోగులపై అరుస్తూ కనిపిస్తాడని పేర్కొన్నారు. ఆఫీస్ మీటింగ్ సమయంలో కూడా ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం చాలా బాధాకరమైనది అని రెడ్డిట్ పోస్ట్‌లో చేసిన ఆరోపణలను మాజీ ఉద్యోగి ధృవీకరించారు.