Mla’s Defection : ఆ ఎమ్మెల్యేలకు ఊరట.. కడియం, దానం భవితవ్యంపై ఉత్కంఠ.!
- ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై ముగిసిన స్పీకర్ విచారణ
- ఎమ్మెల్యే దానం పిటిషన్‌పై ముగిసిన స్పీకర్ విచారణ
- తీర్పు రిజర్వ్. త్వరలోనే దానం, కడియం అనర్హత పిటిషన్లపై స్పీకర్ తీర్పు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన ఎమ్మెల్యేల ఫిరాయింపుల వ్యవహారం ఇప్పుడు ఒక నిర్ణయాత్మక దశకు చేరుకుంది. బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ గూటికి చేరిన పది మంది ఎమ్మెల్యేల అనర్హత వేటుపై దాఖలైన పిటిషన్లపై అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ శనివారం తుది విచారణను పూర్తి చేశారు. సుప్రీంకోర్టు విధించిన గడువు సమీపిస్తున్న నేపథ్యంలో, స్పీకర్ తీసుకున్న ఈ నిర్ణయం రాష్ట్ర రాజకీయాల్లో అత్యంత కీలకంగా మారింది. విచారణ అనంతరం స్పీకర్ వెలువరించిన ప్రాథమిక నిర్ణయాలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి. మొత్తం పది మంది ఎమ్మెల్యేలలో ఎనిమిది మందికి స్పీకర్ క్లీన్ చీట్ ఇచ్చారు. వారిపై దాఖలైన అనర్హత పిటిషన్లలో సరైన ఆధారాలు లేవనో లేదా సాంకేతిక కారణాల వల్లనో ఆ పిటిషన్లను కొట్టివేస్తున్నట్లు ప్రకటించారు.
IPS Love Stroy: ఐపీఎస్ అధికారుల లవ్ స్టోరీ.. బిష్ణోయ్, అన్షిక వర్మలు ఎవరు.?
Also Read
దీనితో ఆ ఎనిమిది మంది ఎమ్మెల్యేలకు పెద్ద ఊరట లభించినట్లయింది. అయితే, అందరి దృష్టి ఇప్పుడు స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్లపైనే ఉంది. వీరిద్దరి కేసుల్లో మాత్రం స్పీకర్ తన తీర్పును వెల్లడించకుండా రిజర్వ్ చేశారు. వీరి విషయంలో ఫిర్యాదులు , ఆధారాలు బలంగా ఉన్నాయా లేక మరేదైనా కారణమా అన్నది తెలియాల్సి ఉంది. వీరిద్దరి భవితవ్యంపై స్పీకర్ ఏ క్షణమైనా తుది తీర్పు వెలువరించే అవకాశం ఉండటంతో, వారి ఎమ్మెల్యే పదవులు ఉంటాయా లేదా అనే ఉత్కంఠ తెలంగాణ రాజకీయాల్లో పరాకాష్టకు చేరుకుంది.
తాజావార్తలు
-
Maharashtra: జాయింట్ వీల్లో చిక్కుకున్న మహిళ జడ.. జట్టుతో సహా తల చర్మం ఊడి తీవ్ర గాయం..
-
Post Office Schemes: బంపర్ స్కీమ్.. పైసా రిస్క్ లేకుండా నెలనెలా రూ.9 వేలకు పైగా ఆదాయం! ఓ లుక్ వేయండి
-
Head Coach: హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ.. అసిస్టెంట్ కోచ్‌గా యువరాజ్ సింగ్!
-
Rahul Gandhi: బ్రిక్స్ డిన్నర్ మెనూపై రాహుల్ రాజకీయం..
-
India: అమెరికా, చైనాలను దాటి భారత్ నెంబర్-1.. యూఎస్ ఆర్థికవేత్త సంచలన వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!