Building Collapses: దేశ రాజధాని ఢిల్లీలోని ముస్తఫాబాద్ ప్రాంతంలో ఆరు అంతస్తుల భవనం ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ఘటనలో ఇప్పటి వరకు నలుగురు మరణించగా.. శిథిలాల కింద మరికొందరు ఉన్నట్లు అనుమానిస్తున్నారు.
గురుగ్రామ్ హాస్పిటల్ ఐసీయూలో ఎయిర్ హోస్టెస్‌పై లైంగిక దాడికి పాల్పడిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. బీహార్‌లోని ముజఫర్‌పూర్ జిల్లాలోని బధౌలి గ్రామానికి చెందిన నిందితుడు దీపక్ ను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. గురుగ్రామ్‌లోని ఒక ఆసుపత్రిలోని ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో ఒక మహిళపై అత్యాచారం చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిని అరెస్టు చేయడానికి 8 బృందాల సహాయంతో ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) రంగంలోకి దిగింది. Also Read:RCB vs PBKS : భారీ…
Crime In Delhi: దేశ రాజధాని ఢిల్లీలో గురువారం నాడు మూడు హత్యలు జరిగాయి. రాష్ట్రంలో శాంతిభద్రతలపై బీజేపీ ప్రభుత్వంపై ఆమ్ ఆద్మీ పార్టీ తీవ్రంగా మండిపడింది.
Maoists Surrender: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని సుక్మా జిల్లాలో ఈ రోజు ( ఏప్రిల్ 18న) 22 మంది మావోయిస్టులు భద్రతా దళాల ముందు లొంగిపోయారు. వారిలో 12 మందిపై రూ.40 లక్షల రివార్డు ఉందన్నారు పోలీసులు.
వైఎస్ జగన్ హెలికాప్టర్ వివాదం రోజు రోజుకీ ముదురుతోంది. రామగిరి మండలం పాపిరెడ్డిపల్లి పర్యటనలో.. జగన్ హెలికాప్టర్ దెబ్బ తినడం.. ఆ తర్వాత ఆయన రోడ్డు మార్గం వెళ్లడం పై వివాదం రాజుకుంది. జగన్ పర్యటనలో భద్రతా లోపం ఉందంటూ ఆరోపణలు రావడంతో పోలీసులు ఈ సంఘటనను సీరియస్ గా తీసుకున్నారు. అసలు హెలికాప్టర్ విషయంలో ఏం జరిగిందన్న దానిపై విచారణ చేపట్టారు.
డబ్బులు సంపాదించడానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి.. అయితే, ఈజీగా డబ్బులు సంపాదించడం.. జల్సాలు చేయడానికి అలవాటు పడి.. కొందరు తప్పుడు మార్గాలను ఎంచుకుంటున్నారు.. అందులో భాగంగా మాయమాటలు చెప్పేవాళ్లు... అమ్మాయిలను ట్రాప్ చేసి ముగ్గులోకి దింపేవారు... అమ్మాయిల న్యూడ్ వీడియోలను బ్యాన్ చేసిన పోర్న్ వెబ్ సైట్లకు అమ్ముకుంటూ లక్షలకు లక్షలు సంపాదించేవారు... ఇలాంటి ఓ దుర్మార్గపు గ్యాంగ్ ఆట కట్టించారు సైబర్ సెక్యూరిటీ పోలీసులు.
పవన్ కల్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్‌పై సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు పోస్ట్ చేసిన వ్యక్తులను పట్టుకున్నారు గుంటూరు పోలీసులు.. కర్నూలు జిల్లాకు చెందిన రఘు అలియాస్ పుష్పరాజ్.. ట్విట్టర్ వేదికగా ఈ పోస్ట్ చేసినట్టు గుర్తించామని తెలిపారు ఎస్పీ సతీష్‌కుమార్.. నిందితుడు రఘు మహిళలపై కూడా చాలా అసభ్యకరమైన పోస్టింగ్‌లు చేసినట్టు.. అతడి సోషల్ మీడియా ఖాతాలను పరిశీలిస్తే స్పష్టం అవుతుందన్నారు..
Rape Case: విశాఖ పట్నంలో మరో దారుణ ఘటన చోటు చేసుకుంది. సభ్య సమాజం తలదించుకునేలా ప్రవర్తించాడు ఓ తండ్రి. ఈ ఘటన భీమిలిలోని తగరపువలసలో పాత కృష్ణ కాలేజ్ ఎదురుగా ఉన్న షాపు దగ్గర మద్యం మత్తులో ఉన్న తండ్రి అప్పన్న కన్న కూతురిపై అత్యాచారం చేసేందుకు ప్రయత్నించాడు.