వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తలపెట్టిన రైతు నివేదన దీక్షకు అనుమతి నిరాకరించారు హైదరాబాద్ పోలీసులు.. ఇందిరాపార్క్ వద్ద మూడు రోజుల పాటు వైఎస్ షర్మిల రైతు నివేదన దీక్ష నిర్వహించేందుకు అనుమతి కోరారు.. అయితే, మూడు రోజుల దీక్షను అనుమతి ఇచ్చేందుకు నిరాకరించారు సెంట్రల్ జోన్ పోలీసులు.. కానీ, రేపు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకే దీక్ష నిర్వహణకు అనుమతి ఇచ్చారు. దీంతో.. దానికి అనుగుణంగా వైఎస్ఆర్…
రాజధాని రైతుల పాదయాత్రలో లాఠీ ఛార్జ్ అప్రజాస్వామికం అన్నారు జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్. రైతుల పాదయాత్రలో గాయాల పాలైనవారికి.. చేయి విరిగిన రైతుకు వైద్యం బాధ్యత ప్రభుత్వానిదే అన్నారు. రాజధాని కోసం భూములిచ్చిన రైతులు చేపట్టిన పాదయాత్రకు సంఘీభావం తెలియచేసేందుకు వచ్చిన వారిపై లాఠీ ఛార్జ్ చేయడం దురదృష్టకరం. మద్దతు చెప్పడం, సంఘీభావం తెలియచేయడం ప్రజాస్వామ్యంలో భాగమే. అదేమీ నేరం కాదు. రైతులు చేపట్టిన కార్యక్రమానికి సంఘీభావాన్ని చెప్పేవారిని అడ్డుకోవడం అప్రజాస్వామిక చర్య అన్నారు…
కొన్నేళ్లుగా ఏవోబీ బార్డర్లో గంజాయి సాగు విస్తృతంగా సాగుతుంది. దీంతో ప్రభుత్వం దీనిపై ఉక్కుపాదం మోపుతుంది. విశాఖ ఏజెన్సీలో గంజాయి పంట సాగు చేస్తున్న గిరిజనులు మీడియాతో మాట్లాడారు. మేం ప్రభుత్వాన్ని వ్యతిరేకించడం లేదు. గంజాయి మొక్కలు సాగు నేరమే అయినా ఎన్నో కష్టాలతో మేం ముందుకు వచ్చాం. ప్రభుత్వం ముందే చెబితే మేం గంజాయి వేసే వాళ్లం కాదు కదా అంటున్న గిరిజ నులు. మా ఆర్థిక స్థితిగతుల ప్రకారమే మేం గంజాయి వేస్తున్నామని గిరిజనులు…
భారీ వర్షాలకు చెన్నై అతలాకుతలం అవుతోంది. పోలీసులు, అగ్నిమాపక, ఎన్టీఆర్ఎఫ్ సిబ్బంది అవిశ్రాంతంగా పనిచేస్తున్నారు. ఓ మహిళా పోలీస్ సబ్ ఇన్ స్పెక్టర్ చేసిన సేవ అందరినీ ఆకట్టుకుంటోంది. వర్షాల వల్ల రోడ్డు పక్కన పడి ఉన్న వ్యక్తి సాయం కోసం ఎదురుచూస్తున్నాడు. అప్పుడే అక్కడ విధులు నిర్వహిస్తున్న మహిళా పోలీస్ సబ్ ఇన్ స్పెక్టర్ విశేషంగా స్పందించారు. ఆ వ్యక్తిని అక్కడినించి తరలించేందుకు సరైన వాహనాలు అందుబాటులో లేవు. వెంటనే స్పందించిన మహిళా పోలీస్ సబ్…
ఇటీవల కాటేదాన్ బ్యాటరీ పరిశ్రమలో పెద్ద మొత్తంలో నగదును ఎత్తికెళ్లిన కేసును ఛేదించిన మైలారేదేవ్పల్లి పోలీసులు, శంషాబాద్ ఎస్ఓటీ పోలీసులను బుధవారం సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్రా, అభినందించి రివార్డులను అందజేశారు. వివరాల్లోకి వెళ్తే.. కాటేదాన్లో ఉన్న ఓ బ్యాటరీ పరిశ్రమలో బీహార్ రాష్ట్రానికి చెందిన మహ్మద్ మసూద్ పదేండ్లుగా నమ్మకంగా పని చేస్తున్నాడు. కాగా యజమాని తెచ్చిన డబ్బులు ఆఫీసు అల్మారాలో పెట్టడం గమనించిన మసూద్ ఈ నెల 1 వ తేదీ రాత్రి బీహార్కు…
చిత్తూరు జిల్లా కుప్పంలో పోలీసులు వ్యవహరించిన తీరుపై రాష్ర్ట ఎన్నికల కమిషనర్కు టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ఫిర్యాదు చేశారు. రాష్ట్రంలో పోలీస్ రాజ్యం నడుస్తుందని వైసీపీ ప్రభుత్వం పై విమర్శలు గుప్పించారు. ఎన్నికల సమయంలోఎన్ఈసీ ఆదేశాలనుసారం అధికారులు నడవాలి కానీ, డీజీపీ నేతృత్వంలో పోలీసు వ్యవస్థ నడుస్తుందని ఆయన ఆరోపించారు. ఎన్నికల ప్రచారానికి పోలీసుల అనుమతి అవసరమా అని ఆయన ప్రశ్నించారు. ఎన్ఈసీ ఎన్నికల నిబంధనలు ఏమైనా మార్చారా అంటూ ఆయన మండిపడ్డారు.…
నల్లగొండ పట్టణంలో.. పెళ్లిళ్ల మీద పెళ్లుళ్లు చేసుకున్న ఓ నిత్యపెళ్లి కొడుకు బాగోతం బయటపడింది. నల్లగొండ క్లాక్ టవర్ సెంటర్ చర్చి లో పియానో వాయిస్తున్న విలియమ్స్… అనేక మంది మహిళ లను ట్రాప్ చేశాడు. చర్చికి వచ్చే మహిళలను లోబర్చు కున్నాడు. విలియ మ్స్ ఉచ్చులో 19 మంది మహిళలు ఉన్నట్లు తెలుస్తోంది. మొదటి భార్య తనూజ ఫిర్యాదుతో .. ఈ నిత్యపెళ్లికొడుకు బాగోతం వెలుగులోకి వచ్చింది. చర్చికి వచ్చే మహిళలపై విలియమ్స్ కన్ను పడింది.…
ప్రముఖ పారిశ్రామిక వేత్త ముఖేష్ అంబానీకి చెందిన ముంబైలోని నివాసంలో కలకలం రేగింది. ఆయన నివాసానికి అనుమానాస్పద ఫోన్ కాల్స్ రావడంతో అప్రమత్తం అయిన పోలీసులు.. అంబానీ ఇంటి దగ్గర భద్రతను కట్టుదిట్టం చేశారు. అయితే, ముంబైలోని ముకేష్ అంబానీ నివాసం అంటిల్లాకు ఈ రోజు అనుమానాస్పద ఫోన్ కాల్ వచ్చింది. ఆ కాల్ చేసిన వ్యక్తి ట్యాక్సీ డ్రైవర్ అని తేలింది. ఇక, ఇద్దరు వ్యక్తులు ముకేష్ అంబానీ ఇంటికి బ్యాగ్ తీసుకెళ్లాలని కోరారని ఆ…
హైదరాబాద్లోని సరూర్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణమైన ఘటన వెలుగుచూసింది… కుటుంబ కలహాల నేపథ్యంలో కట్టుకున్న భర్తని కడతేర్చిన ఓ ఇల్లాలు.. ఆ తర్వాత పోలీస్ స్టేషన్కు వెళ్లి లొంగిపోయింది.. పూర్తి వివరాల్లోకి వెల్తే.. గత కొంతకాలంగా స్థానికంగా మురళీధర్ రెడ్డి, మౌనిక అనే దంపతులు నివాసం ఉంటున్నారు.. వీరికి 11 ఏళ్ల క్రితమే వివాహం జరిగింది.. వారికి సంతానంగా 9 ఏళ్ల బాబు కూడా ఉన్నాడు.. అయితే, గత కొంతకాలంగా వీరిద్దరి మధ్య భేదాభిప్రాయాలు రావడంతో…