ప్రస్తుతం శిల్పా చౌదరి కేసు సంచలనంగా మారుతోంది. అధిక వడ్డీ పేరుచెప్పి ప్రముఖుల వద్ద నుంచి కోట్లు కొల్లగొట్టిన ఈమెను ఇటీవల్ పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఇక ఈ కేసులో ఆమెకు కోర్టు బెయిల్ కూడా నిరాకరించింది. ఇక తాజాగా శిల్పా చౌదరి కేసులో సంచలన విషయాలు బయటకు వచ్చాయి. ఎట్టకేలకు పోలీసులు ముందు నోరూ విప్పింది శిల్పా. రాధికా రెడ్డి అనే రియాల్టర్ తనను మోసం చేసినట్టు పోలిసులకు స్టేట్మెంట్ ఇచ్చింది శిల్పా.…
తెలంగాణలో ఓమిక్రాన్ తీవ్రత నేపథ్యంలో ప్రభుత్వం మాస్కులు వాడని వారిపై కఠినంగా వ్యవహరిస్తోంది. తాజాగా జరిమానాల జాతర మొదలైంది. ఒకవైపు ట్రాఫిక్ పోలీసులు హెల్మెట్ లేకున్నా, డ్రంక్ డ్రైవ్‌లో పట్టుబడ్డా చలానాలు రాస్తున్నారు. ఇప్పుడేమో కోవిడ్ తీవ్రత పెరగడంతో మళ్ళీ జరిమానాలు మొదలయ్యాయి. భద్రాచలంలో మాస్కుల జరిమానాలు షురూ అయ్యాయి. భద్రాచలంలో మాస్కులు లేకుండా తిరుగుతున్న 10 మందికి 10 వేలు జరిమానా విధించారు ట్రాఫిక్ ఎస్ఐ శ్రీపతి తిరుపతి. దేశంలో ఓమిక్రాన్ అలజడి రేగడంతో తెలంగాణ…
కెమిస్ర్టీ పబ్‌లో పని చేసే ఓ మహిళ పై లైంగిక దాడి జరిగిందన్న విషయం మాకు తెలియదని పబ్ ఎండీ సంతోష్ మీడియాకు తెలిపారు. దీనికి సంబంధించిన పలు విషయాలను ఆయన వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… పోలీసులు వచ్చి చెప్పేంతవరకు లైంగిక దాడి ఘటన విషయం మాకు తెలియదని ఆయన అన్నారు. లైంగిక దాడి ఘటనకు పబ్‌కు ఎలాంటి సంబంధం లేదని ఆయన చెప్పారు. పబ్‌లో పనిచేసే సిబ్బంది డ్యూటీ ముగించుకుని వెళ్లాక బయట…
అసలే కోతి.. కల్లు తాగిందంటారు. దీనికి ప్రతిరూపమే ఈ వ్యక్తి. అసలే తిక్క చేష్టలు చేసే వ్యక్తి పైగా మందు తాగాడు, మెడలో పాముతో బయటకు వచ్చాడు. డబ్బులివ్వాలని, లేదంటే పాముతో కరిపించేస్తానని ఒకటే గొడవ. సంగారెడ్డి జిల్లా గ్రేటర్ పరిధిలోని భారతీనగర్ డివిజన్లో తాగుబోతు హల్చల్ చేశాడు. మెడలో ఆరడుగుల పాము వేసుకుని ప్రతి ఒక్కరిని డబ్బులు ఇవ్వాలని బెదిరించాడు. డబ్బులు ఇవ్వని వారి పైన పాము వదులుతానని భయభ్రాంతులకు గురిచేశాడు. స్థానికులు పోలీసులకు సమాచారం…
అత్త ఇంటికి కన్నం వేసిన అల్లుడిని పట్టుకున్నారు పోలీసులు. దీని పై హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్ మాట్లాడుతూ… ఉస్మానియా యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ పరిధిలో దొంగతనం కేసు 24 గంటల్లో ఛేదించాము. 12 లక్షల నగదు తో పాటు, 1.5 కేజీ గోల్డ్.. మొత్తం విలువ 65 లక్షల విలువ అయిన బంగారం, నగదు స్వాధీనం చేసుకున్నారు. జోగిని రంగమ్మ అనే 60 ఏళ్ల మహిళ ఇంట్లో వరుసకు అల్లుడు లక్ష్మన్ చోరీ చేసినట్టు ఫిర్యాదు…
తెల్లాపూర్‌లో విషాదం చోటు చేసుకుంది.. సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ విద్యుత్ నగర్లో ఓ కుటుంబం మొత్తం ఆత్మహత్యకు పాల్పడింది… భార్య, భర్త ఇద్దరు పిల్లలు సహా నలుగురు మృతిచెందారు.. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం పోలీస్ స్టేషన్ తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలో ఉన్న విద్యుత్ నగర్ లో చంద్రకాంత రావు అనే వ్యక్తి భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి నివాసం ఉంటున్నాడు.. సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్న ఆయనకు గత కొంతకాలంగా భార్యతో తరచూ గొడవలు…
ఆంధ్రప్రదేశ్‌లో మరోసారి కాల్ మనీ వ్యవహారం కలకలం సృష్టిస్తోంది.. కృష్ణా జిల్లాలో కాల్‌మనీ వ్యవహారం సంచలనంగా మారింది.. కాల్ మనీ మాఫియా వేధింపులు భరించలేక ఓ వీఆర్వో ఆత్మహత్య చేసుకోవడం సంచలనం సృష్టిస్తోంది.. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. కృష్ణా జిల్లాలోని ఎ.కొండూరు మండలం చీమలపాడు గ్రామానికి చెందిన గౌస్ అనే వ్యక్తి వీఆర్వోగా విధులు నిర్వహిస్తున్నారు.. ప్రస్తుతం కొండపల్లి గ్రామ వీఆర్వోగా పనిచేస్తున్న ఆయన.. వడ్డీ వ్యాపారస్తుల వద్ద కుటుంబ అవసరాల నిమిత్తం కొంత అప్పుగా తీసుకున్నాడు..…
కసింకోటలో పసికందు అనుమానాస్పద మృతి కేసులో చిక్కుముడి వీడింది. పసికందు తల్లి సంధ్యను హంతకురాలిగా నిర్ధారించారు పోలీసులు. తన మతిస్థిమితం బాగోలేదని, ఎందుకు చంపోనో తనకే తెలియదని పోలీసులకు వివరణ ఇచ్చింది తల్లి సంధ్య. కొంతకాలం క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు సంధ్య, అప్పలరాజు. అయితే ఇటీవల వీరి మధ్య మనస్పర్ధలు వచ్చాయి. ఇక నిన్న అర్ధరాత్రి 12 గంటలకు 37 రోజుల బాబును తీసుకెళ్లి వరండాలో ఉన్న డ్రమ్ములో సంధ్య ముంచేసింది. అనంతరం తనకేమీ తెలియనట్లు…
కొండపల్లి ఛైర్ పర్సన్ ఎన్నిక ప్రక్రియను జరిపి తీరాల్సిందేనని పట్టుపడుతోంది టీడీపీ. ఏదో విధంగా ప్రక్రియను ఆపేందుకు వైసీపీ తనవంతు ప్రయత్నాలు చేస్తోంది. దీంతో కొండపల్లి పంచాయతీ రసకందాయంగా మారింది. కొండపల్లి మునిసిపల్ ఎన్నికల ఛైర్ పర్సన్ ఎన్నిక ప్రక్రియ సందర్భంగా జరిగిన పరిణామాలపై లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది టీడీపీ. గొడవ సృష్టిస్తోన్న వైసీపీపై చర్యలు తీసుకుని, సజావుగా మునిసిపల్ ఎన్నికలు జరిపించాలని కోరుతూ లంచ్ మోషన్ పిటిషన్ వేసింది. హైకోర్టులో ఈ పిటిషన్…
హైదరాబాద్ సిటీ వ్యాప్తంగా ఉన్న స్పా సెంటర్ లపై టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడులు చేసారు. వెస్ట్ జోన్, నార్త్ జోన్, సెంట్రల్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు కలిసి ఈ దాడులు చేసారు. బంజారాహిల్స్, పంజాగుట్ట, మహంకాళి, ఖర్కనా , మరెడ్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలలో ఉన్న అన్ని స్పా లపై దాడులు జరిపారు పోలీసులు. మసాజ్ సెంటర్ల ముసుగులో నిభందనలకు విరుద్ధంగా క్రాస్ మసాజ్ కు పాల్పడుతున్నారు పలువురు స్పా నిర్వాహకులు. దాంతో…