‘గేట్ వే’పై సైబర్ ఎటాక్.. కోట్లలో కొట్టేశారు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఒకప్పుడు దొంగతనం చేయాలంటే.. ప్రత్యక్షంగా అక్కడికి వెళ్లాలి.. బెదిరించో.. అదిరించో.. ఇంకో విధంగానో అందినకాడికి దండుకునేవారు… కానీ, ఆధునిక యుగంలో అంతా మారిపోయింది.. అంతా స్మార్ట్ అయిపోయారు.. చివరికి దొంగలు కూడా టెక్నాలిజీని ఉపయోగించి స్మార్ట్‌గా కొట్టెస్తున్నారు.. తాజాగా, గేట్ వే సంస్థపై సైబర్ ఎటాక్ జరిగింది.. అరగంట వ్యవధిలో కోటి 28 లక్షల రూపాయలు కాజేశారట కేటుగాళ్లు.. ఇంకా భారీగానే కొట్టేసే ప్రయత్నం చేయగా.. అలారం మోగడంతో అప్రమత్తమైన ఆ సంస్థ అధికారులు.. ఆ ప్రయత్నాని అడ్డుకోగలిగారు.. ఇక, ఈ ఘటనపై సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.. హైదరాబాద్‌లో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే..
హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని పేమెంట్ గేట్ వే సంస్థకు సైబర్ నేరగాళ్లు టోకరా వేశారు.. ఒడిశాకు చెందిన ఎలక్ట్రికల్ సంస్థ పేరుతో పేమెంట్ గేట్ వేలో మర్చంట్‌గా రిజిస్ట్రేషన్ చేయించుకున్న సైబర్ నేరగాళ్లు.. గేట్ వే సంస్థకు చెందిన అకౌంట్ నుండి కోటి 28 లక్షల రూపాయలు కాజేశారు.. మరింత డబ్బు బదిలీ చేస్తుండగా సర్వర్‌లో అలారం మోగడంతో అప్రమత్తమైన సంస్థ సిబ్బంది.. ఆ ప్రయత్నానికి బ్రేక్ వేశారు.. ఈ ఘటనతో అలర్ట్ అయిన సంస్థ పోలీసులను ఆశ్రయించింది.. హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు పేమెంట్ గేట్ వే సీఈవో ప్రభాకర్.. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు.
Also Read
తాజావార్తలు
-
Abhishek Sharma: కాటేరమ్మ కొడుకా మజాకా.. బంతి వేయడమే ఆలస్యం కొట్టుడే కొట్టుడు.. చరిత్ర స్పష్టించిన అభిషేక్..
-
Bangladesh: ‘‘ప్రతీసారి భారత్ గురించి ఆలోచించం, హసీనా మాదిరి ఉండదు’’.. బంగ్లాదేశ్ పొగరు మాటలు..
-
IND Vs SL: మహిళల ఆసియా కప్ ఫైనల్.. శ్రీలంక బౌలర్లపై విరుచుకుపడిన షఫాలీ వర్మ, స్మృతి మంధాన..
-
IAF Report: ఆపరేషన్ సిందూర్‌పై IAF సంచలన రిపోర్ట్.. పాక్ F-16లు, రాడార్లు ధ్వంసం..
-
Prithviraj Sukumaran: ‘వారణాసి’ చేస్తూనే 9 సినిమాలు.. మాలీవుడ్ స్టార్ స్పీడ్ చూసి జక్కన్న షాక్!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Tears: వైభవ్ సూర్యవంశీ కంటతడి.. వీడియో, ఫొటోస్ వైరల్!
-
Smriti Mandhana: హార్డెస్ట్ నైట్.. స్మృతి మంధానను వెంటాడుతున్న ఆ జ్ఞాపకం!
-
Head Coach: హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ.. అసిస్టెంట్ కోచ్‌గా యువరాజ్ సింగ్!
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!