హైదరాబాద్ ఓల్డ్‌సిటీ ఛత్రినాక పేలుడు కేసులో కొత్త ట్విస్ట్ తెరపైకి వచ్చింది.. టపాసులతో పాటు కెమికల్ పెట్టి మరీ యువకులు పేల్చినట్టుగా పోలీసులు గుర్తించారు. గుంతలో టపాసులు పెట్టిన.. కొందరు యవకులు.. దానితో పాటు కెమికల్స్ మిక్స్ చేశారు. గుంతలో కెమికల్స్, టపాసులు కలవడంతో పేలుడు తీవ్రత పెరిగింది.. ఈ ప్రమాదంలో ఇద్దరు ప్రాణాలు కోల్పోగా.. మరొకరి పరిస్థితి విషమంగా మారింది.. ఇక, ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు, క్లూస్ టీమ్స్ ఆధారాలు సేకరించారు. కాగా, ఛత్రినాక…
మన రాష్ట్రంలో ఈ మధ్య చిన్నారులపైన అత్యాచార కేసులు ఎక్కువగా నమోదవుతున్నా విషయం తెలిసిందే. అయితే మళ్ళీ రాజన్న సిరిసిల్ల జిల్లా… ఎల్లారెడ్డిపేట మండలం… అల్మాస్ పూర్ గ్రామంలో ఆరేళ్ల చిన్నారిపై అత్యాచార ఘటన జరిగింది. ఇక దీని పై స్పందించిన మంత్రి కేటీఆర్… ఈ ఘటన అత్యంత బాధాకరమని అన్నారు. బాధిత కుటుంబానికి అధైర్య పడొద్దు… అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. హైదరాబాద్ లో నిలోఫర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలికను, కుటుంబ సభ్యులను ఆస్పత్రికి…
కర్నూలు జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ప్రియుడితో వెళ్తూ బైక్ నుంచి కింద పడి ఇంజినీరింగ్ యువతి మృతి చెందిన ఘటన ఓర్వకల్ మండలం ఎంబాయి వద్ద చోటు చేసుకుంది. వెల్దుర్తి మండలం బొమ్మిరెడ్డి పల్లికి చెందిన ఓ యువతి.. ఈ రోడ్డు ప్రమాదంలో మృతి చెందింది. ఈనెల19న ఆ యువతికి వేరే యువకుడితో వివాహం జరగాల్సి ఉంది. అయితే ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం లక్ష్మిపురానికి చెందిన వెంకటేశ్వర్లుని ఆమె ప్రేమించినట్టుగా తెలుస్తోంది. ఈరోజు తన…
వారిద్దరు ప్రేమించుకున్నారు.. పెళ్లి చేసుకుందామనుకున్నారు.. ఆరేళ్ల ప్రేమ వివాహంగా మారుతోందని ఆ అమ్మాయి మోహంలో సిగ్గులు మొగ్గలు వేసింది. ఇరు కుటుంబాలు పెళ్ళికి ఒప్పుకోవడంతో వారి ఆనందానికి అవధులు లేవు. అంగరంగ వైభవంగా ఇద్దరి నిశ్చితార్థం జరిగింది. కొద్దిరోజుల్లో పెళ్లి అని ఆనందపడేలోపు యువకుడు షాక్ ఇచ్చాడు. స్నేహితుడి ప్రేయసితో పారిపోవడంతో.. వధువు సహా ఇరు కుటుంబ సభ్యులు షాకయ్యారు. రాజస్తాన్ లో జరిగిన ఈ ఘటన ప్రస్తుతం సంచలనంగా మారింది. వివరాలలోకి వెళితే.. రాజస్థాన్‌లోని జోద్‌పూర్‌కు…
తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు గంజాయిని మించిన హాట్ టాపిక్ లేదు. పోలీసుల కళ్ళు గప్పి గంజాయి విద్యాసంస్థలకు సరఫరా అవుతోంది. తూర్పుగోదావరి జిల్లా కాకినాడతో పాటు చుట్టుపక్కల ప్రాంతాలలో గంజాయి,కాఫ్ సిరప్,టాబ్లెట్స్ లను విద్యాసంస్థలే లక్ష్యంగా యువతకు అమ్ముతున్న ముఠా ను 29వ తేదీన 2వ పట్టణ పోలీసులు పట్టుకున్నారు. విముక్తి కాలనీ సమీపంలో ఒక పాడుబడిన హాస్పిటల్ ప్రాంగణంలో ముఠా సభ్యులను అరెస్ట్ చేశారు. నిందితుల వివరాలను పోలీసులు మీడియాకు వివరించారు. మట్టి విజయ్ కుమార్…
పోలీసులు ఎన్ని కఠిన చర్యలు తీసుకుంటున్నా నగరంలో ఎక్కడో ఒక చోట వ్యభిచార దండాలు నడుస్తూనే ఉన్నాయి. అమాయకులైన ఆడపిల్లలకు డబ్బు ఆశచూపి ఈ రొంపిలోకి దింపుతున్నారు. తాజాగా కూకట్ పల్లిలో ఒక ఇంట్లో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు తెలుసుకున్న పోలీసులు రైడ్ చేసి నలుగురిని అరెస్ట్ చేశారు. వివరాలలోకి వెళితే హైదరాబాద్ కేపీహెచ్‌బీకాలనీలోని రోడ్డు నెంబర్ 4 లో గల ఒక ఇంటిని బి.రాజు, నూర్‌పాషా కాసింబీ అనే ఇద్దురు వ్యక్తులు అద్దెకు తీసుకున్నారు. కొన్ని రోజుల…
జనసేన అధినేత పవన్ కల్యాణ్ విశాఖపట్నం టూర్‌కు సిద్ధం అయ్యారు.. రేపు విశాఖలో పర్యటించనున్న ఆయన.. విశాఖ ఉక్కు పరిశ్రమ కార్మికులకు అండగా పోరాటంలో పాల్గొననున్నారు.. ఓవైపు ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణపై కేంద్రం ముందుకు సాగుతున్నా.. మరోవైపు పోరాటం కొనసాగిస్తున్నారు కార్మికులు.. వారికి ఇప్పటికే బీజేపీ మినహా అన్ని పార్టీలు మద్దతు ప్రకటించగా.. ఇప్పుడు జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రత్యక్షంగా మద్దతు తెలపనున్నారు.. అయితే, వైజాగ్‌లో పవన్ కళ్యాణ్ బహిరంగ సభ వేదికపై సందిగ్ధత నెలకొంది.…
ప్రభుత్వ వైఖరిని ప్రశ్నిస్తే కార్యకర్తల కాళ్లు విరిగేలా దాడులకు పాల్పడతారా అంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కుమార్ అన్నారు. కిసాన్ మోర్చా నాయకులపై పోలీసుల దౌర్జన్యాన్ని ఆయన ఖండించారు. పోలీసుల దాడిలోకార్యకర్తలకు తీవ్ర గాయాలయ్యాయ న్నారు. ఒక నాయకుడికి కాలు విరిగిందని, ఇంకో నాయకుడి మెడపై తీవ్రగాయమైనట్టు ఆయన తెలిపారు. గాయపడ్డ కార్యకర్తలను తక్షణమే ఆసుపత్రికి తరలించాలని ఆయన అన్నారు. వందలాది మంది కార్యకర్తలను అరెస్టు చేశారని వారు ఏం పాపం చేశారని బండి సంజయ్…
కిసాన్ మోర్చా నాయకులపై పోలీసుల దౌర్జన్యాన్ని ఖండిస్తున్నా అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ అన్నారు. ప్రభుత్వ వైఖరిని ప్రశ్నిస్తే కార్యకర్తల కాళ్ళు , విరిగేలా దాడి చేస్తరా అని బండి సంజయ్ ప్రశ్నించారు. పోలీసుల దాడిలో కార్యకర్తలకు తీవ్ర గాయాలయ్యాయి. ఒక నాయకుడి కాలు విరిగింది, ఇంకో నాయకుడి మెడ పై తీవ్ర గాయం అయింది అని బండి సంజయ్ తెలిపారు. ఇక గాయపడ్డ కార్యకర్తలను తక్షణమే ఆసుపత్రికి తరలించాలి. వందలాది మంది…
డాక్టర్.. దేవుడి తరువాత దేవుడిలా కొలిచే మనిషి. ఎవరికి చెప్పుకోలేని బాధలను సైతం డాక్టర్ల వద్ద చెప్పుకుంటాము. కానీ, ఇక్కడ మనం చెప్పుకోబోయే ఒక డాక్టర్ ఆ పవిత్ర వృత్తికే కళంకం తెచ్చాడు. పవిత్రమైన వృత్తిలో ఉంటూ పాడుపనులు చేయడం మొదలుపెట్టాడు. వైద్యం కోసం వచ్చిన మహిళలకు మాయమాటలు చెప్పి వారిని లొంగదీసుకోవడానికి ప్రయత్నించాడు. ఇటీవల హాస్పిటల్ కి వచ్చిన మహిళా డాక్టర్ దగ్గర కూడా తన నీచ బుద్దిని బయటపెట్టాడు. దీంతో ఆమె పోలీసులకు ఫిర్యాదుచేయడంతో…