భూపాలపల్లి జిల్లా సర్వాయి పేటలో దారుణం చోటు చేసుకుంది. ఒంటి పై నగల కోసం నీచానికి ఒడిగట్టారు. 75 ఏళ్ల వృద్దురాలని కూడా చూడకుండా పాశవికంగా హత్య చేసిన ఘటన సర్వాయి పల్లిలో వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం … లంగారి లక్ష్మీ(75) మంగళవారం సాయంత్రం ఎనిమిది గంటల సమయంలో సీరియల్ చూడటానికి పెద్ద కొడుకు ఇంటికి వెళ్లింది. సీరియల్ చూసి న అనంతరం తిరిగి ఇంటికి బయలు దేరింది. బుధవారం తెల్లవారిన ఎంత సేపటికి ఇంటికి రావపోవడంతో అనుమానం వచ్చిన కొడుకు ఇంటికి వెళ్లి చూశాడు. ఇంట్లో కూడా లేకపోవడంతో గ్రామం మొత్తం ఆమె ఆచూకీ కోసం వెతికారు. అయినా దొరకలేదు. నాలుగు రోజుల తర్వాత గ్రామంలోని ఓ పాతబావిలో శవమై తేలింది. ఆమెను దారు ణంగా హత్య చేసి, శరీరానికి బండరాళ్లు కట్టి పడేసి బావిలో పడేసి నట్లు గుర్తించారు. ఆతరువాత బావిలోనుంచి వెలికి తీయగా ఒంటిపై బంగారం కనిపించలేదు. బంగారం లేకపోవడంతో పాటు ఆమె ఒంటి పై గాయాలు అయినట్టు గుర్తించారు. దీంతో నగల కోసమే ఆమెను హత్య చేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు.
కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలకు పోలీసులు పలు సూచనలు చేశారు. ఎవరైనా కొత్త వారు వస్తే తమకు సమాచారం వెంటనే అందించాలని కోరారు. దీంతో పాటే గ్రామంలో నిఘా అవసరమన్నారు. సీసీ కెమె రాలు ఏర్పాటు చేసుకోవాలని తెలిపారు. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ఎవరైనా అనుమానస్పదంగా కనిపిస్తే తమకు సమాచారం అందించి నేరాల నివారణకు తోడ్పాపాటును అందించాలని పోలీసులు తెలిపారు.