హైదరాబాద్ అత్తాపూర్ ఎమ్ఎమ్ పహాడీలో రెచ్చిపోయాడో రౌడీ షీటర్. మహ్మద్ రియాజ్ అనే యువకుడి పై కత్తి తో దాడికి పాల్పడ్డాడు రౌడీ షీటర్ చోర్ అబ్బాస్. కత్తి పోట్లతో తీవ్రంగా గాయపడ్డ రియాజ్ ని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ఓ ఫంక్షన్ కు వెళ్లి తిరిగి వస్తుండగా ఎమ్ ఎమ్ పహాడీ వద్ద ఓ వ్యక్తి తో గొడవ పడుతున్నాడు చోర్ అబ్బాస్. వారిని విడిపించే ప్రయత్నం చేశాడు రియాజ్.
ఒక్కసారిగా తన వద్ద వున్న కత్తి తో రియాజ్ పై దాడి చేశాడు రౌడీ షీటర్ చోర్ అబ్బాస్. రెండు కత్తి పోట్లకు గురి కావడంతో ఆసుపత్రికి తరలించారు. 100 డయల్ చేసి పోలీసులకు సమాచారం ఇచ్చారు స్థానికులు. హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దాడికి పాల్పడిన చోర్ అబ్బాస్ పోలీసులను చూసి పారిపోయాడు నిందితుడు. 4 రోజుల క్రితం జైల్ నుండి బయటకు వచ్చాడు అబ్బాస్. అబ్బాస్ పై పలు కేసులు వున్నాయి. 307 సెక్షన్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు రాజేంద్రనగర్ పోలీసులు.