హైదరాబాద్ రాజేంద్రనగర్ లో భారీగా గాంజాయి పట్టుకున్నారు పోలీసులు. వైజాగ్ నుండి హైదరాబాద్ మీదుగా మహారాష్ట్ర తరలిస్తున్న 45 కేజీల గాంజాయి సీజ్ చేసింది క్రైమ్ టీమ్. విశ్వసనీయ సమాచారం మేరకు రాజేంద్రనగర్ చింతల్ మెట్ చౌరస్తా లో కాపు చేసారు క్రైమ్ టీమ్ పోలీసులు… ఓ కారును అడ్డగించి తనిఖీలు చేసిన కాప్స్ కారు డిక్కిలో గాంజాయి గుర్తించారు. పోలీసులను చూసి కారును వదలి పారిపోయే యత్నం చేసిన కేటుగాళ్లు. పారిపోతున్న దుండగులను వెంబడించి పట్టుకున్నారు పోలీసులు. కారుతో పాటు గాంజాయి సీజ్ చేసిన పోలీసులు… ముగ్గురు దుండగుల అరెస్ట్ చేసి… కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.