దేశంలోని విపక్ష పార్టీలన్నీ కలిసి కూటమికి I.N.D.I.A అని పేరును పెట్టుకోవడం తెలిసిందే. అయితే ఆ పేరును తప్పుడు ప్రచారంగా వాడుకుంటున్నట్లు పోలీస్ కేసు నమోదైంది. I-N-D-I-A పేరుపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ న్యూఢిల్లీలోని బరాఖంబ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.
ముంబై నుంచి అమృత్సర్ వెళ్తున్న గోల్డెన్ టెంపుల్ రైలులో ఉగ్రవాదులు ఉన్నారనే సమాచారంతో పోలీసు బలగాలు అలర్ట్ అయ్యారు. వారి కోసం పోలీసులు జల్లెడ పడుతున్నారు.
తమిళనాడులో ఓ అమానవీయకరమైన ఘటన వెలుగులోకి వచ్చింది. మత్తు మాత్రలు ఇచ్చి ఓ హిజ్రాపై ఇద్దరు వ్యక్తులు లైంగిక దాడికి పాల్పడ్డారు. ఆ ఇద్దరు నేరస్థులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జన్నీ, బ్లసికాలు చెన్నైపెరంబురు ఏరియాకు చెందిన హిజ్రాలు.
భారతదేశంలో మినీ నయాగరాగా పేరుగాంచిన ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని చిత్రకోట్ జలపాతంలో ఆత్యహత్య చేసుకునేందుకు ఓ యువతి దూకింది. జలపాతం దగ్గర ఉన్న వ్యక్తులు.. ఆమెను అడ్డుకునే ప్రయత్నం చేసినా కూడా.. ఆమె నీటిలో దూకేసింది. ఆ యువతి దాదాపు 110 అడుగుల ఎత్తు నుంచి వాటర్ ఫాల్స్ లోకి దూకింది. అదృష్టవశాత్తూ ఆమె చావు నుంచి తప్పించుకుంది.
ఉత్తరప్రదేశ్‌లోని జలౌన్‌లో ఓ యువకుడు తన ప్రియురాలిని గొంతుకోసి హత్య చేశాడు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనా స్థలానికి చేరుకుని కేసు దర్యాప్తు చేపట్టారు. కేవలం 24 గంటల్లోనే నిందితుడిని అరెస్ట్ చేసి వివరాలను బయటపెట్టారు.
భవిష్యత్త్ సాంకేతిక సాధనంగా మారిపోయిన ఈ ఏఐ టెక్నాలజీ సాయంతో సైబర్ నేరగాళ్లు దొంగతనాలు చేస్తున్నారు. అందుకు ఏఐ ఆధారిత డీప్‌ఫేక్ టెక్నాలజీని వినియోగిస్తున్నారు. తాజాగా ఏఐతో ముఖం మార్చుకున్న ఓ సైబర్ నేరగాడు.. ఓ వ్యక్తి దగ్గర నుంచి భారీగా డబ్బు వసూలు చేశాడు. అయితే తాను మోసపోయానని గ్రహించిన బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు.
ఉత్తరప్రదేశ్‌లోని బెల్తారా రైల్వే స్టేషన్‌కి చెందిన రైల్వే పోలీసులు చేసిన పనికి సర్వాత్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు. రైల్వే స్టేషన్ లో నిద్రిస్తున్న చిన్నారిని పోలీసులు తన్నడం మనం చూడవచ్చు. ఆ బాలుడిని కొట్టడంతో అక్కడే ఉన్న జనం ఒక్కసారిగా గుమిగూడారు. కానీ, ఆ పోలీసులు చిన్నారి గొంతుపై కాలు పెట్టి గట్టిగా నొక్కడంతో ఆ పిల్లవాడు తన తలతో పైకి ఎగరడం కనిపిస్తుంది. అయితే, పోలీసుల కర్కశత్వాన్ని ప్రదర్శించడాన్ని.. ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్…
మహారాష్ట్రలోని పూణెలో వరుస వేధింపులకు పాల్పడుతున్న ఓ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడు అనూప్ వానీగా గుర్తించారు. లిఫ్ట్ ఇస్తానని చెప్పి అమ్మాయిలను వేధించేవాడని పోలీసులు తెలిపారు. దాదాపు 18 మంది బాలికలను వేధించాడని వారు పేర్కొన్నారు.