తెలంగాణ సాంస్కృతి సంప్రదాయాలను చాటి చెప్పే విధంగా బోనాల ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. గోల్కొండలో ప్రారంభమైన బోనాలు యావత్ రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జరుతున్నాయని తెలిపారు. బోనాలకు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుంది. రాజకీయాలకు అతీతంగా బోనాల జాతర కొనసాగుతుంది.
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే లాల్‌దర్వాజా అమ్మవారి బోనాల జాతర వైభవంగా కొనసాగుతుంది. బోనాల జాతరతో హైదరాబాద్ నగరం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. సింహవాహిని మహంకాళి అమ్మవారిని దర్శించుకోడానికి తెల్లవారు జామునుంచే భక్తులు పోటెత్తారు. ఆలయం దగ్గర బోనాలతో మహిళలు పెద్ద ఎత్తున బారులు తీరారు. లాల్‌దర్వాజా బోనాల పండగా సందర్భంగా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు.
తెలంగాణ రాష్ట్రంలో ఘనంగా జరుగుతున్న బోనాల పండగా ఇవాళ హైదరాబాద్ వ్యాప్తంగా కొనసాగుతుంది. నేడు, రేపు పాతబస్తీలోని ప్రధాన ఆలయాల్లో బోనాలు పెద్ద ఎత్తున జరుగనున్నాయి. అంబర్ పేట్ లోని మహంకాళి ఆలయంలో ఇవాళ( ఆదివారం) ఉదయం 6 గంటల నుంచి 18( మంగళవారం) తేదీ వరకు ఉత్సవాలు జరుగనున్నాయి. దీంతో హైదరబాద్ లో నగర పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలను అమలు చేస్తున్నారు.
తెలంగాణ ప్రజలు ఆషాడమాసంలో సంప్రదాయంలో భాగంగా బోనాల ఉత్సవాల పండగ జరుపుకుంటున్నారు. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా బోనాల పండగ ఉండటంతో ఇవాళ్టి నుంచి ఈ నెల 18వ తేదీ వరకు మద్యం షాపులు క్లోజో చేయాలని ఎక్సైజ్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో మందుబాబులు అర్థరాత్రి వరకు వైన్ షాప్స్ ముందు మందు కొనుగోలు చేశారు.
వికారాబాద్ జిల్లాలో ఆర్టీసీ అధికారుల చెకింగ్ వాహనంలో చోరీ జరిగింది. ఖమ్మం జిల్లాకు చెందిన టీఎస్ఆర్టీసీకి చెందిన చెకింగ్ అధికారులు వికారాబాద్ జిల్లాలోని తాండురులో నిన్న (శుక్రవారం) రాత్రి 9.30 గంటలకు డిపోలో చెకింగ్ చేసినట్లు పేర్కొన్నారు. చెకింగ్ అనంతరం రాత్రి 10 గంటల సమయంలో భోజనం చేసేందుకు డిపో పక్కనే ఉన్న హోటల్ కు వెళ్లారు. అయితే, అధికారులు భోజనం చేసేందుకు వెళ్లడం చూసిన దుండగులు పార్కింగ్ చేసిన వాహనంలో నుంచి ఓ బ్యాగ్ ను…
జమ్ముకాశ్మీర్ లో దారుణ ఘటన చోటు చేసుకుంది. షోపియాన్ జిల్లాలో బీహార్ కు చెందిన ముగ్గురు వలస కూలీలపై ఉగ్రవాదులు కాల్పులు జరిపి చంపేశారు. ఈ ఘటన గగ్రాన్ అనే ప్రాతంలో జరిగింది. దీనిపై సమాచారం అందిన వెంటనే ఆ ప్రాంతాన్ని పోలీసులు, ఆర్మీ అధికారులు చుట్టుముట్టాయి. క్షతగాత్రులను చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారిని అన్మోల్ కుమార్, పింటూ కుమార్ ఠాకూర్, హీరాలాల్ యాదవ్ గా పోలీసులు తెలిపారు.
తాజాగా తొమ్మిది నెలలు మోసి కనిపెంచిన కన్న తల్లిని ఓ తాగుబోతు మద్యం తాగేందుకు డబ్బులు ఇవ్వాలని పొట్టుపొట్టుకొట్టాడు. మద్యానికి డబ్బు ఇవ్వలేదని కన్న తల్లినే నడి రోడ్డుపై జుట్టు పట్టి లాగి ఓ యువకుడు పిడిగుద్దులు కురిపించాడు. ఈ ఘటన నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని శ్రీపురం రోడ్డులో ఇవాళ (బుధవారం) జరిగింది. అయితే.. నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రానికి చెందిన పద్మమ్మ భర్త కోల్పోయి ఓ హోటల్ లో పని చేస్తూ జీవనం కొనసాగిస్తుంది.