Students Fighting: విద్యార్థులు రోడ్డెక్కారు.. రోడ్డెక్కడం అంటే.. అదేదో తమ హక్కులు సాధించుకోవడానికో.. తమకు అన్యాయం జరుగుతోందని ఆందోళనకు చేయడానికో కాదు.. రోడ్డుపైకి వచ్చి తన్నుకున్నారు.. ఈ ఘటన బాపట్లలో జరిగింది.. బాపట్లోని చైతన్య కాలేజీకి చెందిన విద్యార్థులు వీరంగం సృష్టించారు.. సూర్యలంక రోడ్డులోని ఓ హోటల్ సమీపంలో బాహాబాహికి దిగారు విద్యార్థులు.. ఈ ఘర్షణకు పాత గొడవలే కారణమని తెలుస్తుండగా.. రెండు వర్గాలుగా చీటిపోయిన విద్యార్థులు విచక్షణారహితంగా కొట్టుకున్నారు.. ఈ ఘర్షణలో పలువురు విద్యార్థులకు గాయాలు అయినట్టుగా తెలుస్తోంది.. అయితే, రోడ్డుపై విద్యార్థులు రెండు వర్గాలుగా చీలిపోయి కొట్టుకోవడంతో.. అటుగా వెళ్లే వాహనదారులు కూడా ఇబ్బంది పడ్డారు.. విద్యార్థులు ఇలా తన్నుకోవడం ఏంటని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు చదువుకోమని హాస్టల్‌కి పంపిస్తే.. ఇలా ఘర్షణలకు దిగడం ఏంటని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు విద్యార్థులు తల్లిదండ్రులు. విద్యార్థుల మధ్య పోటీ ఉండాలి, సరదాగా సాగిపోవాలి.. కానీ, ఇలా రోడ్డెక్కి కొట్టుకోవడంపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Read Also: TSRTC: టీఎస్ఆర్టీసీని ప్రభుత్వంలో విలీన నిర్ణయం హర్షదాయకం