ప్రపంచంలో అమ్మ ప్రేమను మించింది ఏది లేదు. ఆత్మీయత, అనురాగం, అనుబంధం.. వీటిని మించి అమ్మ ప్రేమలో ఉంటుంది. బిడ్డలపై చూపించే అమ్మ ప్రేమకు మరొకటి సరితూగదు. తన కోసం కాకుండా తన పిల్లల కోసం సర్వస్వం చేస్తుంది. తాను తినకపోయిన తన పిల్లలకు తినిపించాలనే స్వభావం అమ్మ ప్రేమలో ఉంటుంది. అయితే అమ్మ ప్రేమ అనేది.. కేవలం మనుషుల్లోనే కాదు.. అన్నీ జీవుల్లో కూడా అలానే ఉంటుంది. అయితే మాతృప్రేమను చాటిన ఓ ఘటన తాజాగా…
తెలంగాణ సీఐడీ ఎస్పీ కిషన్ సింగ్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఓ మహిళ ఇచ్చిన ఫిర్యాదుపై సీఐడీ ఎస్పీపై కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్లు పేర్కొన్నారు. కొత్త పేటలోని TSSPDCL సీనియర్ అసిస్టెంట్ కు సీఐడీ ఎస్పీ కిషన్ సింగ్ వేధింపులకు గురిచేసినట్లు తెలుస్తోంది.
మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఉజ్జయిని జిల్లా బిర్లా గ్రామ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ గ్రామంలో 15 ఏళ్ల బాలిక నివసిస్తోంది. అయితే, ఆమెపై ముగ్గురు మైనర్లు ఇటీవల అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ దారుణాన్ని వారు తమ సెల్ ఫోన్లలో వీడియో కూడా తీసిన.. ఆ ముగ్గరు మైనర్లు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
తెలంగాణలో రానున్న రెండు రోజుల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశమున్నందున.. రాష్ట్రంలోని పోలీస్ యంత్రాంగాన్ని డీజీపీ అంజనీ కుమార్ అప్రమత్తం చేశారు. రానున్న 48 గంటలలో రాష్టంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో.. చేపట్టాల్సిన ముందుజాగ్రత్త చర్యలపై పోలీస్ కమీషనర్లు, ఎస్పీలతో బుధవారం రాత్రి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
వర్షాల కారణంగా హైదరాబాద్ లో ట్రాఫిక్ జాం అవుతున్న నేపథ్యంలో ఐటీ కంపెనీల్లో పనిచేసే ఉద్యోగులకు 3 దశలవారీగా లాగ్ అవుట్ చేసుకోవడానికి సైబరాబాద్ పోలీస్ శాఖ సూచించింది.
హైదరాబాద్ లోని చైతన్యపురిలో పోపిస్ట్రా అనే మత్తుమందును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అంతేకాకుండా మత్తుమందును విక్రయిస్తున్న రాజస్థాన్ కు చెందిన రమేష్ అనే వ్యక్తిని ఎల్బీనగర్ ఎస్వోటీ పోలీసులు అరెస్ట్ చేశారు.
తెలంగాణ వ్యాప్తంగా గత కొన్ని రోజులుగా మోస్తారు నుంచి భరీ వర్షాలు కురుస్తున్నాయి. హిమాయత్ సాగర్ ప్రాజెక్టులోని ఆరు గేట్లను అధికారులు ఎత్తేశారు. అయితే, ఇప్పటికే వరద నీరు భారీగా వస్తుండటంతో శుక్రవారం ఈ ప్రాజెక్ట్ లోని రెండు గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడిచిపెట్టారు. మూసీ నది పరిసర ప్రాంతాల్లోని ప్రజలకు అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.
విద్యార్థుల సమస్యలపై విద్యార్థి సంఘాలు పనిచేస్తాయి. ఇది సర్వసాధారణం. విద్యార్థుల సమస్యలపై మిలిటెంట్ పోరాటాలు చేసిన సందర్భాలు ఉన్నాయి. విద్యార్థుల పోరాటాలతో ప్రభుత్వాలు కూలిన సందర్భాలు ఇండియాలో ఉన్నాయి.