హర్యానాలోని నుహ్‌లో ఈరోజు (సోమవారం) మధ్యాహ్నం 1 గంటలకు విశ్వహిందూ పరిషత్ కాషాయ యాత్ర చేపట్టింది. ఈ యాత్రలో కాల్పులు, రాళ్ల దాడి జరిగింది. దీంతో జిల్లా వ్యాప్తంగా ఉద్రిక్తత నెలకొంది. మధ్యాహ్నం ప్రారంభమైన దహనకాండ ఇప్పటికీ ఆగడం లేదు. రోడ్డుపై కాలిపోతున్న వాహనాలు, పొగలు ఇంకా దర్శనమిస్తున్నాయి. ఈ ఘటనలో ఇద్దరు హోంగార్డులు మరణించగా, మరో ఇద్దరు పోలీసు అధికారులకు తీవ్రంగా గాయాలయ్యాయి. మరోవైపు శాంతించాలని పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్ అమలు చేశారు. అంతేకాకుండా ఎటువంటి పుకార్లు రాకుండా ఇంటర్నెట్ సేవలను తాత్కాలికంగా నిలిపివేశారు. అయితే నుహ్ లో మొదలైన హింస ప్రభావం ఇప్పుడు రాష్ట్రం మొత్తం కనిపిస్తోంది. సోహ్నా బైపాస్‌లో రాళ్లు రువ్వినట్లు వార్తలు వినిపిస్తుండగా, మరోవైపు బహదూర్‌ఘర్‌లో బజరంగ్ దళ్ కార్యకర్తలు అడ్డుకున్నారు.
Bigg Boss Sohel: ఏందిరా ఈ తేడాగాడు అని ఏడిపించారు..
శోభా యాత్రలో ఘర్షణ జరిగినప్పుడు మేవాత్‌లో హింస, దహనం, విధ్వంసం, రాళ్లదాడి, నినాదాలు మరియు కోలాహలం మొదలయ్యాయి. ఫిరోజ్‌పూర్ జిర్కా నుండి సిగర్ చేరుకోవాల్సిన యాత్రను.. నుహ్‌లోని నాళేశ్వర్ శివాలయం నుండి హిందూ సంస్థలు చేపట్టాయి. యాత్రలో పాల్గొనేందుకు హర్యానాతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి కూడా ప్రజలు ఇక్కడికి చేరుకున్నారు. గత 3 సంవత్సరాలుగా ఈ యాత్రను మేవాత్ జిల్లాలో నిర్వహిస్తున్నారు. అయితే ఈ సమయంలో అనుకోకుండా ఓ గొడవ ప్రారంభం కావడంతో.. ఇరువర్గాల మధ్య ఘర్షణ తలెత్తింది. దీంతో గొడవ పెద్దది కావడంతో.. అక్కడ ఉన్న పలు వాహనాలను తగలబెట్టారు.
Sri Sri Ravi Shankar: రవిశంకర్ గురుదేవ్‌కు అరుదైన గౌరవం.. అమెరికా, కెనడాల్లోని 30 నగరాల్లో దినోత్సవం
మరోవైపు నుహ్‌లో చెలరేగిన హింసాకాండ.. గురుగ్రామ్‌లోని సోహ్నాకు చేరాయి. సోహ్నాలోని అంబేద్కర్ చౌక్‌పై దుండగులు రాళ్లు రువ్వారు. పలు పోలీసు వాహనాలను ధ్వంసం చేశారు. ముందుజాగ్రత్తగా ఢిల్లీ-జైపూర్ హైవేపై రాజీవ్ చౌక్ వద్ద బలగాలను మోహరించారు. దాదాపు 1,000 మంది పోలీసులను గురుగ్రామ్ నుండి నుహ్‌కు పంపారు. గురుగ్రామ్‌కు చెందిన ఒక హోంగార్డు నోహ్ హింసలో వీరమరణం పొందగా, ఇద్దరు అధికారులు గాయపడ్డారు. నుహ్‌లో కొనసాగుతున్న హింసపై ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. నేటి సంఘటన దురదృష్టకరమని, రాష్ట్రంలో శాంతిభద్రతలు కాపాడాలని ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నానని తెలిపారు. దోషులను ఎట్టిపరిస్థితుల్లోనూ వదిలిపెట్టబోమని, వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.