డీ మ్యాట్ అకౌంట్ వివరాలు తీసుకుని నిందితుల బ్యాంక్ అకౌంట్లు వివరాలు ఇచ్చి అమౌంట్ ను వీరి అకౌంట్ లోకి ట్రాన్స్ ఫర్ చేసుకున్నారు.. దాదాపు 140 మంది బాధితుల నుంచి కోటి ఎనిమిది లక్షల రూపాయల మోసం జరిగింది.. ఎనిమిది నెలలుగా ఈ మోసానికి పాల్పడుతున్నారు అని స్నేహ మెహ్రా పేర్కొన్నారు.
నేరస్థులపై ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ఉత్తర్ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్య నాథ్ సమర్థించుకున్నారు. నేరస్థుల ఇళ్లపై ప్రభుత్వం చేపట్టిన బుల్డోజర్ ఆపరేషన్ను సీఎం యోగి ఆదిత్యనాథ్ సమర్థించారు.
Chennai: ఈ తెల్లవారుజామున 3.30 గంటల ప్రాంతంలో చెన్నై గుడువాంచేరి సమీపంలో అసిస్టెంట్ ఇన్స్పెక్టర్ శివగురునాథన్.. పోలీసు శాఖ వాహనాల తనిఖీలో నిమగ్నమై ఉంది. ఆ సమయంలో ఓ నల్లటి కారు వేగంగా వచ్చింది. అతి వేగంగా వస్తున్న కారును చూసిన పోలీసు శాఖ అడ్డుకునేందుకు ప్రయత్నించింది.
హర్యానాలోని నుహ్లో ఈరోజు (సోమవారం) మధ్యాహ్నం 1 గంటలకు విశ్వహిందూ పరిషత్ కాషాయ యాత్ర చేపట్టింది. ఈ యాత్రలో కాల్పులు, రాళ్ల దాడి జరిగింది. దీంతో జిల్లా వ్యాప్తంగా ఉద్రిక్తత నెలకొంది. మధ్యాహ్నం ప్రారంభమైన దహనకాండ ఇప్పటికీ ఆగడం లేదు. రోడ్డుపై కాలిపోతున్న వాహనాలు, పొగలు ఇంకా దర్శనమిస్తున్నాయి. ఈ ఘటనలో ఇద్దరు హోంగార్డులు మరణించగా, మరో ఇద్దరు పోలీసు అధికారులకు తీవ్రంగా గాయాలయ్యాయి.
వికారాబాద్ జిల్లాలో కేవలం 50 రూపాయల కోసం హత్య చేసిన కేసులో నిందితుడికి జీవిత ఖైదుతో పాటు 1000 రూపాయల జరిమానా విధించినట్లు జిల్లా న్యాయస్థానం వెల్లడించింది. గత ఏడాది పెద్దేముల్ మండలం పాషాపూర్ తండాలో రూ.50 ఇవ్వలేదని మంగ్లీ భాయ్ని రాథోడ్ విల్లాస్ అనే వ్యక్తి హత్య చేశాడు.
భారీ వర్షం హైదరాబాద్ నగరానికి మరోసారి వణికించింది. ఇవాళ (సోమవారం) సాయంత్రం పలు ప్రాంతాల్లో కురిసిన భారీ వర్ష ప్రభావంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. ఇక ఆఫీసులు, ఇతర పనులు ముగిసిన సమయం కావడంతో పలు చోట్ల భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. అయితే, నగరంలో చాలా చోట్ల వాన నీరు రోడ్ల పైన నిలిచిపోయింది.
మాజీ మంత్రి నారాయణ, తన భర్త సుబ్రహ్మణ్యం తనను వేధిస్తూ బెదిరింపులకు గురిచేస్తున్నారని పోలీసులకు ఫిర్యాదు చేసింది. హైదరాబాదులోని రాయదుర్గం పోలీస్ స్టేషన్ లో పొంగూరు కృష్ణప్రియ క్రిమినల్ కంప్లైంట్ దాఖలు చేసింది.