భారీ వర్షం హైదరాబాద్ నగరానికి మరోసారి వణికించింది. ఇవాళ (సోమవారం) సాయంత్రం పలు ప్రాంతాల్లో కురిసిన భారీ వర్ష ప్రభావంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. ఇక ఆఫీసులు, ఇతర పనులు ముగిసిన సమయం కావడంతో పలు చోట్ల భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. అయితే, నగరంలో చాలా చోట్ల వాన నీరు రోడ్ల పైన నిలిచిపోయింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అలాగే పలు మార్గాల్లో ట్రాఫిక్ జామ్ అయిన పరిస్థితులు నెలకొన్నాయి. ఐటీ కారిడార్.. హైదరాబాద్ శివారు అయిన సైబరాబాద్‌లో ఈ పరిస్థితి మరీ దారుణంగా ఉంది.
Read Also: Matrimony: పెళ్లి చేసుకుంటానంది.. రూ. కోటి కాజేసింది
ఐకియా నుంచి జేఎన్‌టీయూ వరకు భారీ ఎత్తున ట్రాఫిక్ నిలిచి పోయింది. మరోవైపు నానక్‌రామ్ గూడ, బయో డైవర్సిటీ రూట్‌లోనూ వెహికిల్స్ స్లోగా ముందుకు కదులుతున్నాయి. కొండాపూర్, గచ్చిబౌలి, మాదాపూర్ రూట్‌లలోనూ భారీ వర్షం కురవడంతో ట్రాఫిక్‌కు అటంకం కలుగుతోంది. అయితే, మరి కాసేపట్లోనూ మరోసారి వర్షం కురవొచ్చనే హెచ్చరికల నేపథ్యంలో.. ట్రాఫిక్ జామ్ మరింత పెరిగే ఛాన్స్ ఉండటంతో ట్రాఫిక్ పోలీసులు అప్రమత్తం అయ్యారు. దీంతో పోలీసులు వాహనాల రద్దీని క్లీయర్ చేస్తున్నారు.
Read Also: Manchu Vishnu: మా ప్రెసిడెంట్ కీలక నిర్ణయం.. అది చేయలేకనేనా.. ?
హైదరాబాద్ నగరంలో మరోసారి భారీ వర్షం కురవొచ్చని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేయడంతో ప్రయాణికులు తొందరగా ఇంటికి వెళ్తుండటంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ఇప్పటికే భారీ వర్షం నేపథ్యంలో పలుచోట్లు రోడ్డు మీద నీరు నిలిచిపోయి.. వాహనాలు పోయేందుకు వీలు లేకుండా అయింది.