తెలంగాణ సీఐడీ ఎస్పీ కిషన్ సింగ్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఓ మహిళ ఇచ్చిన ఫిర్యాదుపై సీఐడీ ఎస్పీపై కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్లు పేర్కొన్నారు. కొత్త పేటలోని TSSPDCL సీనియర్ అసిస్టెంట్ కు సీఐడీ ఎస్పీ కిషన్ సింగ్ వేధింపులకు గురిచేసినట్లు తెలుస్తోంది. తాను స్పెషల్ క్లాసులు నిర్వహిస్తున్న వాటిలో పాల్గొనాలని మహిళా ఉద్యోగినికి కిషన్ సింగ్ చెప్పినట్లు ఆమె పేర్కొన్నారు. మహిళ ఉద్యోగి ఫోన్ నంబర్ తీసుకుని తరచూ ఆమెకు అభ్యంతరకర మెసేజ్ లు, ఫోటోలు, వీడియోలను సీఐడీ ఎస్పీ పంపిస్తున్నట్లు ఫిర్యాదులో పేర్కొంది.
Read Also: Hyderabad: గంట వ్యవధిలో మూడు రోడ్డు ప్రమాదాలు.. నలుగురు మృతి
చీరలో నిన్ను చూడాలని ఉంది.. నీ ఫోటోలు పంపు అంటూ తరచూ మహిళ ఉద్యోగిని సీఐడీ ఎస్పీ కిషన్ సింగ్ వేధించినట్లు సదరు ఉద్యోగి కేసు పెట్టింది. ఓ కేసు విషయంలో తనను సంప్రదించిన సమయంలో.. తనకు సహకరించాలంటూ మరోసారి వేధింపులు చేసినట్లు వెల్లడించింది. వేధింపులను తట్టుకోలేక పోలీసులను మహిళా ఉద్యోగిని ఆశ్రయించింది. సీఐడి ఎస్పీ కిషన్ సింగ్ పై చైతన్య పూరి పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. సరూర్ నగర్ స్టేడియంలో నేషనల్ కాంపిటీషన్స్ కు ప్రిపేర్ అవుతున్న ఉద్యోగినిపై తాను డీఎస్పీగా ఉన్న టైంలో కిషన్ సింగ్ కన్నేసినట్లు తేలింది. అయితే, ఈ ఘటనపై పోలీసులు లోతుగా విచారిస్తున్నారు.
Read Also: Women Fight in Bus Video: బస్సులో సీటు కోసం దారుణంగా కొట్టుకున్న మహిళలు.. ఓర్నీ..