మణిపూర్లో కొనసాగుతున్న హింసాత్మకమైన ఘటనలపై దేశ అత్యున్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. హింసను మరింత పెంచేందుకు తమను వాడుకోవద్దని సుప్రీంకోర్టు కోరింది. ప్రభుత్వం చేపట్టిన చర్యల్ని తాము పర్యవేక్షిస్తామని, మరిన్ని చర్యలకు అవసరమైతే తగిన ఆదేశాలను జారీ చేస్తామని చెప్పారు.. అంతేకానీ భద్రతా యంత్రాంగాన్ని తాము నడపలేమని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. మణిపూర్ లో అల్లర్లను కట్టడి చేయాలని కోరుతూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాలను సుప్రీంకోర్టు విచారణ సందర్భంగా ఈ కామెంట్స్ చేసింది.
ప్రస్తుతం దేశ వ్యాప్తంగా భారీగా వర్షాలు కురుస్తున్నాయి.. దాంతో పాటు జనాలకు వణుకు పుట్టించేలా కూరగాయల ధరలు భారీగా పెరుగుతున్నాయి..ఈ రోజు ధర రేపు ఉంటుందా అనేటంతగా ధరలు పెరుగుతున్నాయి. ధరల పెరుగుదలతో వినియోగదారులు ఏమి కొనేటట్లు లేదు.. రెక్కాడితే కానీ డొక్కాడని రోజూవారి కూలీలకు పెను భారంగా కూరగాయల ధరలు పెరుగుతున్నాయి.. ముఖ్యంగా దేశంలో ఇక్కడ అక్కడ అని లేకుండా టమాటా ధర పెట్రోల్ ధర కంటే ఎక్కువగా నమోదవుతున్నాయి. అనేక ప్రాంతాల్లో టమాటా ధర…
డబ్బుల విషయంలో ఈ మధ్య కాలంలో హత్యలు పెరిగిపోతున్నాయి. డబ్బులు ఇచ్చిన వారు.. తిరిగి ఇవ్వాలని కోరినప్పుడు దాడులు జరుగుతున్నాయి. కొన్ని సందర్భాల్లో డబ్బులు తిరిగి ఇవ్వాల్సిన వారు.. డబ్బులు ఇవ్వకుండా డబ్బులు ఇచ్చిన వారినే హత్య చేస్తున్నారు.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో కోచింగ్ సెంటర్లకు హైదరాబాద్ ఎంతటి పేరుగాంచిందో.. అలాగే నీట్, జేఈఈ కోచింగ్ దేశంలోని రాజస్థాన్లోని కోటా కూడా అలాగే బాగా ప్రాచుర్యం పొందింది. కోటాలో నీట్, జేఈఈ కోచింగ్ సెంటర్లు ఎక్కువగా ఉంటాయి.
US Crime: ఒక అమెరికన్ వ్యక్తి తన భార్య, ప్రేమికుడితో కలిసి మంచంపై పడుకోవడం చూసి ఉలిక్కిపడ్డాడు. భార్య ప్రియుడిని అల్యూమినియం బ్యాట్తో కొట్టి చంపేందుకు ప్రయత్నించాడు.
సాధారణంగా రాజకీయ పార్టీలు నిర్వహించే సభలు, సమావేశాల్లో పార్టీకి సంబంధంలేనివారు కూడా వచ్చి పాల్గొంటూ ఉంటారు. కొన్ని సందర్భల్లో పార్టీ సమావేశాల్లోకి సైతం కొత్త వ్యక్తులు వస్తుంటారు. అలా వచ్చిన వారిని పార్టీ నేతలు గుర్తించి బయటకి పంపిస్తుంటారు.
బెంగళూరు సౌత్ నియోజకవర్గానికి చెందిన బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య తన మొబైల్ ను సైబర్ నేరగాళ్లు హ్యాక్ చేసినట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. డబ్బు, వజ్రాలు కావాలంటూ గుజరాత్లోని భారతీయ జనతా యువమోర్చా (బీజేవైఎం) నాయకుడికి తేజస్వి సూర్య ఫోన్ నుంచి కాల్స్ వెళ్లినట్లు ఆ ఫిర్యాదులో ఎంపీ తేజస్వీ పీఏ ప్రకాశ్ పేర్కొన్నారు.
మణిపూర్లో హింసాకాండ ఎంతకి ఆగడం లేదు. స్కూల్స్ తెరచిన మరుసటి రోజునే ఓ పాఠశాల బయట ఒక మహిళను ఇద్దరు గుర్తు తెలియని దుండగులు అత్యంత కిరాతకంగా కాల్చి చంపేశారు. గత రెండు నెలలుగా రాష్ట్రంలో కొనసాగుతున్న అల్లర్లు ఇంకా తగ్గుముఖం పట్టలేదు. ఇప్పటికీ రాష్ట్ర ప్రజానీకం సాయుధ దళాల మధ్యలోనే జీవనాన్ని కొనసాగిస్తున్నారు.
Teacher: పిల్లలకు ఉజ్వల భవిష్యత్తును కల్పించడంలో ఉపాధ్యాయులదే కీలకపాత్ర. విద్యార్థులకు మంచి నైతికతను పెంపొందించడం ద్వారా దేశానికి మంచి తరాన్ని రూపొందించేందుకు ఉపాధ్యాయులు కృషి చేస్తారు.
హైదరాబాద్లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. సరూర్ నగర్ పరిధిలో జీఎస్టీ అధికారుల కిడ్నాప్ కలకలం రేపింది. ఈ కిడ్నాప్ కేసును పోలీసులు చేధించిన ఘటనపై కేంద్రం సీరియస్ అయింది. ఈ మేరకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. అధికారుల కిడ్నాప్ ఘటనపై తెలంగాణ పోలీసులను ఆరా తీశారు. అధికారుల కిడ్నాప్ ఉదంతాన్ని తీవ్రంగా ఖండించిన ఆమె.. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డీజీపీ అంజనీ కుమార్ ను ఫోన్లో కోరింది.