ఛలో విధ్యుత్ సౌద మరియు మహాధర్నా సందర్భంగా విజయవాడలోని హోటల్స్, లాడ్జ్ లను ఎన్టీఆర్ జిల్లా పోలీసులు విస్తృత తనిఖీలు నిర్వహించారు. ఈనెల 8న చలో విద్యుత్ సౌధ పిలుపు నేపథ్యంలో పోలీసులు తనిఖీలు చేస్తున్నారు.
నాపరాతిని తమకున్న ఆర్డర్ల కోసం వివిధ ప్రాంతాలకు లారీలలో, ట్రాక్టర్లలో తరలిస్తున్నారు. కానీ వాటిని తరలింపు ఇతర వాహనదారులకు ప్రమాదకరంగా మారింది. నాపరాతి బండలను లారీలలో, ట్రాక్టర్లలో బాడీ లెవెల్ వరకు నింపకుండా.. అధిక లోడ్డుతో వెహికిల్స్ లో నింపుకొని రోడ్లపైకి రావడం వల్ల.. వెనక వచ్చే వాహనాలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
చిత్తూరు జిల్లా పుంగనూర్ ఘటనపై డిప్యూటీ సీఎం నారాయణ స్వామి స్పందించారు. సీఎం జగన్ తన సుదీర్గ పాదయాత్రలో ఎక్కడా కత్తులు, కటార్లతో అల్లర్లకు పాల్పడ లేదు అని ఆయన కామెంట్స్ చేశారు.
చంద్రబాబు కాన్వాయ్ లోని రౌడీ మూకలు కర్రలు, రాళ్లు తెచ్చారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కామెంట్స్ చేశారు. విచక్షణా రహితంగా పోలీసులపై దాడులు చేశారు.. చంద్రబాబు తీరు మొగుడ్ని కొట్టి మొగసాలికేక్కినట్టు ఉంది.. పోలీసులపై దాడులు చేసి.. రివర్స్ లో మాట్లాడుతున్నారు.
సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలంలోని గొంగ్లూర్ తండాలో నివాసం ఉంటున్న బీమ్లా అనే వ్యక్తి ఆందోల్ మండలం అన్నాసాగర్ దగ్గర రోడ్ ప్రమాదం జరగడంతో అతడు అక్కడే మృతి చెందారు. ఈ విషయం తెలిసిన బీమ్లా తండ్రి తట్టుకోలేక పోయారు, చేతికొచ్చిన కొడుకు తన కళ్ళముందే నిర్జీవంగా పడి ఉండటంతో చూసి జీర్ణించుకోలేని బీమ్లా తండ్రి ధర్మా నాయక్ ఒక్కసారిగా గుండెపోటుతో కుప్పకూలి పోయారు.
వరంగల్ జిల్లాలోని హంటర్ రోడ్డులో కెమికల్ బాక్స్ బ్లాస్ట్ అయింది. ఎన్టీఆర్ నగర్ లో కెమికల్ బాక్స్ బ్లాస్ట్ పేలుడులో భూక్య చంద్రు అనే వ్యక్తికి తీవ్ర గాయాలు అయ్యాయి. వరదలకు బోందివాగులో ఆ బాక్స్ కొట్టుకు వచ్చినట్లుగా గుర్తించారు.
రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. తేజస్వినీ అనే 17 సంవత్సరాల యువతి తాను పనిచేస్తున్న హాస్పటల్లో ఉరి పెట్టుకుని అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. అయితే, తేజస్విని మహేశ్వరం మండలం గంగారం గ్రామానికి చెందినది.