West Godavari Crime: కొడుకు లేదా కూతురు పిల్లలు అంటే తాతకు ఎంతో మమకారం ఉంటుంది.. తల్లిదండ్రులు వారిపై కోపంతో అరచినా.. వారిని వెసుకోసుకురావడంలో.. అల్లారిముద్దుగా చూసుకోవడంలో ముందువరసలో ఉంటారు.. తాత, మనవళ్ల మధ్య ప్రత్యేక అనుబంధం ఉంటుంది.. కానీ, ఓ తాత.. తమన మనవడిపట్ల దారుణంగా వ్యవహరించాడు.. ఏకంగా తన వెంట తీసుకెళ్లి.. హత్య చేసి.. మళ్లీ వచ్చి తనకు ఏమీ తెలియనట్టు ఉండిపోయాడు.
Read Also: BJP Leader Sana Khan: బీజేపీ నాయకురాలు సనాఖాన్ హత్య కేసులో ఆమె భర్త అరెస్ట్
పశ్చిమ గోదావరి జిల్లా పెంటపాడు మండలం మీనవల్లురులో జరిగిన దారుణానికి సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. కొడుకు, కోడలు మధ్య విబేధాలు కారణంగా విడాకులు తీసుకుంటే ఆస్తి మనవడికి వెళ్తుందని భావించిన తాతయ్య.. సొంత మనవడిని దారుణంగా హత్య చేశాడు. ఈ నెల 9వ తేదీన ఉదయం బాలుడిని వెంటబెట్టుకుని వెళ్లి హత్య చేసి యణమధుర్రు కాలువలో పడేశాడు. ఏమి తెలియనట్టు ఇంటికి వచ్చిన నిందితుడు పోకల నాగేశ్వరరావు.. మళ్లీ బాబు కనిపించట్లేదంటే అందరితో కలిసి వెతికాడు.. అయితే0, నిన్న బాలుడి మృతదేహం కాలువలో లభ్యం కాగా పోలీసులు విచారణ చేపట్టారు. బాలుడిని 9వ తేదీ ఉదయం తాత నాగేశ్వర రావు తీసుకు వెళ్లడాన్ని చూసిన స్థానికులు.. అతనిపై అనుమానం వ్యక్తం చేయడంతో అసలు విషయం వెలుగు చూసింది. నిందితుడు పరారీలో ఉన్నాడు. బాలుడి మృతదేహానికి పోస్టుమార్టం అనంతరం అంత్యక్రియలు పూర్తి చేయనున్నారు.