మహబూబాబాద్ జిల్లాలోని గూడురులో ప్రేమయవ్వారం కలకలం రేపుతుంది. నిన్న ప్రియుడు, నేడు ప్రియురాలు ఆత్మహత్యయత్నం చేసుకున్నారు. ప్రేమించిన ప్రియుడు కార్తీక్ పెళ్ళికి నిరాకరించడంతో ఆదివారం ప్రియుడి ఇంటి ముందు ప్రియురాలు బైఠాయించింది. ప్రియురాలి ఆందోళనతో ఆమె ప్రియుడు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. ప్రియుడు ఆత్మహత్యాయత్నాన్ని తట్టుకోలేక ప్రియురాలు కూడా ఆత్మహత్యాయత్నం చేసుకుంది. ఆత్మహత్యకు యత్నించిన యువతికి గూడూరులోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చికిత్స అందిస్తున్నారు.
Read Also: Sherfane Rutherford: ‘మ్యాన్ ఆఫ్ ది సిరీస్’గా అర ఎకరం భూమి.. అది కూడా అమెరికాలో!
అయితే, వివరాల్లోకి వెళితే.. మహబూబాబాద్ జిల్లా గూడూరు మండల కేంద్రంలో ప్రేమించిన వాడు మోసం చేశాడని ప్రియుడి ఇంటి ముందు ప్రభావతి అనే యువతి నిరసన తెలిపింది. ఇక, విషయం తెలుసుకున్న పోలీసులు ప్రియుడు కార్తీక్ తో మాట్లాడి న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో ఆమె పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసి నిరసన విరమించింది. ఈ విషయం తెలుసుకున్న ప్రభావతి ప్రియుడు కార్తీక్ నర్సంపేటలో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు. అతను నర్సంపేటలోని ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.
Read Also: Faria Abdullah : ఆ స్టార్ హీరో పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన హాట్ బ్యూటీ..
ఇక, కార్తీక్ పురుగుల మందు తాగిన విషయం తెలుసుకున్న ప్రభావతి నేడు తన ఇంట్లో పురుగుల మందు తాగి తాను కూడా ఆత్మహత్యయత్నం చేసుకుంది. ప్రస్తుతం ప్రభావతి గూడూరు ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. అయితే, ప్రభావతి సూసైడ్ నోట్ రాసింది. తన చావుకు కార్తీక్ మేనమామలు సురేందర్, ఉపేందర్, శ్రీను, శ్రీశైలంతో పాటు ఆయన తల్లిదండ్రులే కారణమని అందులో వెల్లడించింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నారు.