సినీ నటుడు ప్రకాశ్ రాజ్ సందర్శించిన ఓ కాలేజీని అక్కడి విద్యార్థులు గోమూత్రంతో శుద్ధి చేశారు. కర్ణాటక రాష్ట్రం శివమొగ్గలోని ఎం.విశ్వేశ్వరయ్య ఆర్ట్స్ అండ్ కామర్స్ కాలేజీ స్టూడెంట్స్ చేసిన ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అయితే, ఆగస్టు 8న ఆ కాలేజీ క్యాంపస్ లోని ప్రోగ్రామ్ హాల్ లో థియేటర్, సినిమా, సమాజంపై చర్చ అనే కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైయ్యారు. ఈ సమావేశాన్ని ఉద్దేశించి ప్రకాశ్ రాజ్ ప్రసంగించి.. అక్కడి నుంచి వెళ్లిపోయారు. అయితే ఈ విషయం అక్కడున్న కొందరు స్టూడెంట్స్ కు నచ్చలేదు.. కాలేజీలో ప్రైవేటు ప్రోగ్రాం ఎందుకు నిర్వహించారు అని ప్రశ్నించారు. అనంతరం క్యాంపస్ చుట్టూ గోమూత్రాన్ని ఆ విద్యార్థులు చల్లారు.
Read Also: Work From Home: వర్క్ ఫ్రం హోం ఇచ్చి ఉద్యోగిపై నిఘా.. ట్విస్ట్ మామూలుగా లేదుగా..
ప్రకాశ్ రాజ్ ను చూసి తాము నేర్చుకోవాల్సింది ఏమీ లేదంటూ సదరు విద్యార్థులు ఆందోళనకు దిగారు. తుక్డే గ్యాంగ్, ప్రకాశ్ రాజ్ డౌన్ డౌన్ అంటూ స్లోగన్స్ చేశారు. ఈ విద్యార్థులకు స్థానిక బీజేపీ నేత ధర్మ ప్రసాద్ సపోర్ట్ ఇచ్చినట్లు సమాచారం. అయితే భద్రావతిలో ఉన్న ఈ కాలేజీ వెలుపలకు బయటి నుంచి ఆందోళనకారులు రాకుండా పోలీసులు బారికేడ్లు అడ్డు పెట్టారు. దీంతో వారికి, పోలీసులకు మధ్య తీవ్ర గొడవ జరిగింది.
Read Also: RBI Monetary Policy: రెపో రేటులో ఎలాంటి మార్పు లేదు : ఆర్బీఐ గవర్నర్
కాగా.. ఈ ఆందోళన కాలేజీ విద్యార్థులు, బయటి వ్యక్తుల కలయికతోనే జరిగిందని శివమొగ్గ పోలీసులు పేర్కొన్నారు. అయితే, ఈ ఆందోళనలకు బయటి వ్యక్తుల ప్రమేయం ఉన్న వారి గురించి పోలీసులు చెప్పలేదు. కాగా.. హిందీ, తమిళం, ఇతర ప్రాంతీయ భాషాల్లోని సినిమాల్లో ప్రకాశ్ రాజ్ ప్రముఖ నటుడిగా పని చేశారు. అయితే ఆయన గత కొంత కాలం నుంచి కేంద్రం ప్రభుత్వంపై, బీజేపీ పార్టీపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు.