వరంగల్ జిల్లాలో నకిలీ పురుగు మందులు, కాలం చెల్లిన పురుగు మందులతో రైతులను మోసం చేస్తున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు. నిందితుల దగ్గర నుంచి పురుగు మందులను సీజ్ చేశారు. దీనిపై వరంగల్ కమిషనర్ రంగనాథ్ మాట్లాడారు.. రైతన్నను దగా చేస్తూ నకిలీ, గడువు తీరిన పురుగుల మందులు విక్రయిస్తున్న కేటుగాళ్ళ అరెస్టు చేసినట్లు పేర్కొన్నాడు. దేశానికి అన్నం పెట్టే రైతన్నను దగా చేస్తూ నకిలీతో పాటు కాలం చెల్లిన పురుగుల మందులను విక్రయిస్తున్న మూడు ముఠాలోని 13 మంది సభ్యులను అరెస్టు చేసినట్లు సీపీ రంగానాథ్ అన్నారు.
Read Also: Uniform Civil Code: యూనిఫాం సివిల్ కోడ్‌కు వ్యతిరేకంగా కేరళ అసెంబ్లీలో తీర్మానం
ప్రభుత్వ నిషేధిత గడ్డి మందు విక్రయిస్తున్న మరో ఇద్దరిని టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి దగ్గర నుంచి 57 లక్షల రూపాయల విలువైన నకిలీ పురుగు మందులు, గడువు తీరిన పురుగుల మందులు, నిషేధిత గడ్డి ముందు, నకిలీ పురుగు మందులు తయారీకి అవసరమైన రసాయనాలు, ప్రింటింగ్ సామగ్రి, ఖాళీ బాటిల్స్, రవాణాకు వినియోగించే ఒక కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారని సీపీ రంగానాథ్ వెల్లడించారు.
Read Also: Kawasaki Ninja 650: భారత మార్కెట్లోకి కవాసకి నింజా 650.. బైక్ ధర రూ.7.16 లక్షలు
అయితే, దాదాపు 24 లక్షల రూపాయల విలువైన గడువు తీరిన పురుగు మందులు, ఉండగా 30 లక్షల రూపాయల విలువ గల నకిలీ పురుగుల మందులు ఉన్నాయని వరంగల్ కమిషనర్ రంగనాథ్ పేర్కొన్నారు. 3 లక్షల 53 వేల రూపాయల విలువగల ప్రభుత్వ నిషేదిత గడ్డి మందును పోలీసులు స్వాధీనం చేసుకున్నాట్లు ఆయన పేర్కొన్నారు. అలాగే ఇద్దరు పర్టిలైజర్ షాప్ యాజమానులపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
Read Also: Peddireddy Ramachandra Reddy: వాలంటీర్లపై బురద చల్లడానికే చంద్రబాబు ఆరోపణలు
గడువు తీరిన మందులు సైతం విక్రయిస్తున్నట్లు తమ దృష్టికి రావడంతో నిఘా పెట్టగా ఈ ముఠాల గుట్టురట్టైంది అని వరంగల్ సీపీ రంగానాథ్ తెలిపారు. కల్తీలపై ప్రత్యేక దృష్టి పెట్టి, సీరియస్ యాక్షన్ చేపట్టామని ఆయన వెల్లడించారు. కల్తీలతో మోసానికి పాల్పడే వారిపై పీడీ యాక్ట్ అమలు చేస్తామన్నారు. పురుగుల మందులు కొనే ముందు రైతులు జాగ్రత్తగా పరిశీలించి కొనుగోలు చేయాలి అని సీపీ రంగనాథ్ సూచించారు.