ప్రభుత్వ ఉద్యోగులు అనేక క్రీడల్లో కూడా రానిస్తున్నారు.. ఇటీవల చాలా మంది తమలోని టాలెంట్ ను నిరూపించుకున్నారు.. కొందరికి టాలెంట్ ఉంటుంది.. కానీ అదృష్టం ఉండదు. కొందరికి టాలెంట్ తో పాటు అదృష్టం కూడా ఉంటుంది.. దాంతో క్రీడా లోకంలో వారు ధృవ తారలుగా వెలుగొందుతున్నారు. గట్టి పోటీ ఉన్న క్రికెట్ ప్రపంచంలో మెరుపులు మెరిపించడం అంత సులువు కాదు.. అందుకే ప్రతిభావంతులకు కూడా అవకాశం లేక.. కేవలం గల్లీ క్రికెట్ కే పరిమితమయ్యారు. గల్లీ క్రికెట్లోని…
స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల వేళ.. బాంబు బెదిరింపు కాల్స్ కలకలం రేపుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో పలుచోట్ల బాంబులు పెట్టినట్లు సమాచారం అందింది. దీంతో అప్రమత్తమైన అధికారులు వెంటనే చర్యలు తీసుకుంటూ అలర్ట్ అయ్యారు. నగరంలోని శ్రమ శక్తి భవన్, కాశ్మీర్ గేట్, ఎర్రకోట, సరితా విహార్ లో గుర్తు తెలియని బ్యాగులను ఉంచినట్లు పోలీసులు గుర్తించారు.
ఉత్తరాఖండ్లో విషాదం చోటుచేసుకుంది. రుద్రప్రయాగ్ జిల్లాలోని చౌకీ ఫాటా పరిధిలోని తర్సాలి వద్ద రోడ్డుపై ప్రయాణిస్తున్న కారుపై కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో ఐదుగురు యాత్రికులు మరణించినట్లు పోలీసులు శనివారం తెలిపారు.
తమిళనాడులో ఓ టిప్పర్ బీభత్సం సృష్టించింది. రాష్ట్రంలోని చెంగల్పట్టులో ఇవాళ (శుక్రవారం) జరిగిన ప్రమాదంలో ఆరుగురు మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. టిప్పర్ లారీ డ్రైవర్ వాహనంపై అదుపు తప్పి ద్విచక్ర వాహనాలను ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది.
విశాఖపట్టణం వేదికగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నేడు పార్టీ నేతలతో సమావేశం కానున్నారు. ఈ సమావేశం తర్వాత ఆయన రుషికొండ, ఎర్రమట్టి దిబ్బలను పరిశీలించేందుకు వెళ్లనున్నారు.
విశాఖపట్నంలోని పెందుర్తిలో నకిలీ పోలీసుల హల్చల్ చేశారు. పోలీసులమంటూ బెదిరించి దోపిడీకి దిగారు. యువతీ, యువకుడి ఫొటోస్ తీసి నకిలీ పోలీసుల డబ్బులు డిమాండ్ చేశారు. పోలీస్ యూనిఫాం, ఆర్మీ టోపీ ధరించి యువతీ యువకుడిని బెదిరించారు. కేసు నమోదు చేస్తామని బెదిరించి 30 వేల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
జగదాంబ జంక్షన్ జనసంద్రంగా మారడంతో.. ఆ ప్రాంతమంతా జనసైనికులతో కిక్కిరిసిపోయింది. మరోవైపు సభా ప్రాంగణానికి వస్తున్న కార్యకర్తలను పోలీసులు అడ్డుకుంటున్నారు.
సినీ నటుడు ప్రకాశ్ రాజ్ సందర్శించిన ఓ కాలేజీని అక్కడి విద్యార్థులు గోమూత్రంతో శుద్ధి చేశారు. కర్ణాటక రాష్ట్రం శివమొగ్గలోని ఎం.విశ్వేశ్వరయ్య ఆర్ట్స్ అండ్ కామర్స్ కాలేజీ స్టూడెంట్స్ చేసిన ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
Karimnagar: ఆగస్టు 15 సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో అధికారులు అప్రమత్తమయ్యారు. స్వాతంత్య్ర దినోత్సవం నాడు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తుగా అనుమానితుల ఇళ్లపై సోదాలు చేపట్టారు.