జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర నేటి నుంచి స్టార్ట్ కానుంది. విశాఖ నుంచి మూడో విడత వారాహి యాత్రను పవన్‌కళ్యాణ్ ఇవాళ్టి నుంచి మొదలు పెట్టనున్నారు. ఆగష్టు 19 వరకు ఈ వారాహి యాత్ర కొనసాగనుంది. ఉత్తరాంధ్రలో 10 రోజుల పాటు పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు. విశాఖలోని పలు ప్రాంతాలను ఆయన సందర్శించనున్నారు. స్టీల్ ప్లాంట్, గంగవరం పోర్టు కార్మికుల పోరాటానికి జనసేనాని మద్దతు తెలుపనున్నారు. వారాహి యాత్రలో భాగంగా జగదాంబ జంక్షన్‌లో ఏర్పాటు చేసే సభలో పవన్ కళ్యాణ్ మాట్లాడనున్నారు.
Read Also: Mustard Benefits : ఆవాలతో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో తెలిస్తే అస్సలు వదలరు..
అనంతరం జనవాణి కార్యక్రమం, క్షేత్రస్థాయి పర్యటనలకు పవన్ కళ్యాణ్ వెళ్లనున్నారు. ఇక వారాహి యాత్రను పర్యవేక్షించేందుకు ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేసింది. పవన్ వారాహి యాత్రకు షరతులతో కూడిన అనుమతులను పోలీసులు ఇచ్చారు. ఎలాంటి ర్యాలీలు నిర్వహించకూడదని, ఎయిర్‌పోర్ట్ నుంచి ర్యాలీగా రావొద్దని జనసేనానికి సూచించారు. ఇక వాహనం పైనుంచి అభిమానులకు అభివాదాలు చేయవద్దని పోలీసులు షరతు పెట్టారు. జగదాంబ జంక్షన్‌లో బహిరంగ సభకు పోలీసులు అనుమతి మంజూరు చేసినా.. కార్యకర్తలు, అభిమానులు బిల్డింగ్ లు ఎక్కకుండా చూసే బాధ్యత జనసేనదేనని, ఉల్లంఘనలు జరిగితే అనుమతి తీసుకున్నవారిపైన తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Read Also: Twin Banana: జంట అరటిపండ్లను తింటే ఏమౌతుందో తెలిస్తే షాక్ అవుతారు..!
అయితే, పోలీసుల షరతులపై జనసేన పార్టీ ట్విట్టర్‌లో రియాక్ట్ అయింది. ర్యాలీలో లేదా సభా వేదిక దగ్గర క్రేన్లతో గజమాలలు వేయడం లాంటివి చేయవద్దని, పోలీసులకు సహకరించాలని పవన్ కళ్యాణ్ ను కోరింది. వారాహి యాత్ర మార్గంలో క్రేన్లు, వాహనాలు ఏర్పాటు చేయడం వల్ల ట్రాఫిక్ సమస్య వస్తుందని జనసేన పార్టీ తమ ప్రకటనలో వెల్లడించింది. పవన్ కళ్యాణ్ భద్రతకు భగం వాటిల్లకుండా వారాహి యాత్రను సక్సెస్ చేయాలని పిలుపునిచ్చింది. భద్రతా కారణాలను పార్టీ శ్రేణులు, అభిమానులు దృష్టిలో పెట్టుకోవాలని తెలిపింది.