పాకిస్థాన్ లోని పలు చర్చిలు, డజన్ల కొద్దీ ఇళ్లను తగలబెట్టడాన్ని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఖండించింది. మానవ, నైతిక విలువలు, సూత్రాలకు విరుద్ధంగా భద్రత, స్థిరత్వాన్ని దెబ్బతీసే అన్ని పద్ధతులను యూఏఈ శాశ్వతంగా తిరస్కరించిందని మంత్రిత్వ శాఖ తెలిపింది.
మణిపూర్లో మరోసారి జాతీయ రహదారిని దిగ్భంధిస్తున్నట్టు కుకీ సంఘాలు ప్రకటించాయి. దీంతో సోమవారం తెల్లవారు జామునుంచి దిమాపూర్-ఇంఫాల్ జాతీయ రహదారి 2 దిగ్బంధనాన్ని తిరిగి విధిస్తున్నట్లు కుకీ సంఘాలు ప్రకటించాయి.
మియాపూర్ లో దారుణం జరిగింది. భార్యతో పాటు ఆమె కుటుంబాన్ని చంపేందుకు భర్త కుట్ర చేశాడు. పెళ్లి విందులో భార్య కుటుంబ సభ్యులను చంపేందుకు విష ప్రయోగం చేశాడు. ఈ విష ప్రయోగంతో భార్య తల్లి చనిపోగా.. మిగతా ఆరుగురి పరిస్థితి విషమంగా ఉంది.
హైదరాబాదలో మత్తు పదార్ధాలు అమ్ముతున్న వారిపై పోలీసులు గట్టి నిఘా పెట్టారు. పాతబస్తీలోని బహదూర్ పురా పొలీసులు గంజాయి అమ్ముతున్న ఇద్దరీతో పాటు గంజాయి కొని, సేవించే వారిని సైతం అదుపులోకి తీసుకున్నారు.
హైదరాబాద్ నగరంలోని ముషీరాబాద్ పరిధిలోని భోలక్ పూర్ లో భారీ పేలుడు సంభవించింది. అంజుమన్ స్కూల్ సమీపంలోని స్టీల్ స్ర్కాప్ దుకాణంలో కెమికల్ బాక్స్ పేలింది. ఈ ప్రమాదంలో గౌసిద్దిన్ అనే వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. అతడి శరీరం పూర్తిగా కాలిపోయింది.
హైదరాబాద్ లో నకిలీ ట్రాన్స్ జెండర్ల బెగ్గింగ్ మాఫియాలో కొత్తకోణం వెలుగులో వచ్చింది. రాజేష్, అనితలు కలిసి నకిలీ ట్రాంజెండలను తయారు చేస్తున్నారని పోలీసులు గుర్తించారు. రాజేష్, యాదవ్ ల దగ్గర వంద మందికి పైగా నకిలీ ట్రాన్స్ జెండర్.. ఉదయం నుంచి సాయంత్రం వరకు చౌరస్తాలో బెదిరించి డబ్బులు వసూలు చేసినట్లు తెలిపారు.
హైదరాబాద్ లో మైనర్ బాలిక కిడ్నాప్ కలకలం రేపుతోంది. తిలక్ నగర్లో 15 ఏళ్ల బాలిక కనిపించకుండా పోయింది. రెండు రోజుల క్రితం ఇంటి నుంచి బయటికి వెళ్లిన బాలిక ఇంటికి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
రంగారెడ్డి జిల్లాలోని అత్తాపూర్ పోలీస్ స్టేషన్ ముందు గులామ్ హుస్సేన్ కుటుంబ సభ్యుల ధర్నాకు దిగారు. గత 17 రోజుల క్రితం అత్తాపూర్ గోల్డన్ ప్యాలెస్ హోటల్ దగ్గర శవమై తేలిన గులామ్ హుస్సేన్ ను ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారు అని వారు ఆరోపించారు.
స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా రేపు గోల్కొండ పరిసరాల్లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు పెట్టారు. ఇప్పటికే స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా రూట్ మ్యాప్ ను పోలీసులు ఇచ్చారు.