7వ తరగతి చదువుతున్న విద్యార్థిని ఉపాధ్యాయుడు దారుణంగా కొట్టాడు. దీంతో విద్యార్థి తరగతి గదిలోనే స్పృహతప్పి పడిపోయాడు. అపస్మారక స్థితిలోకి చేరిన విద్యార్థిని చికిత్స నిమిత్తం ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. అయితే చిన్నారి గుండెలోని మృదు కణజాలంలో గాయం ఉందని వైద్యులు చెబుతున్నారు.
మియాపూర్ కాల్పుల కేసును పోలీసులు చేధించారు. దేవేందర్ పై కాల్పులు జరిపి చంపేసిన రిత్విక్ అలియాస్ తిలక్ ని పోలీసులు అరెస్ట్ చేశారు. వ్యక్తిగత కారణాలతోనే దేవేందర్ పై రిత్విక్ కాల్చి చంపినట్లు ఒప్పుకున్నాడని పోలీసులు తెలిపారు.
మీర్ పేట పోలీస్ స్టేషన్ పరిధిలో 16 ఏళ్ల బాలికపై అత్యాచారం కేసులో ఆరుగురిని అదుపులోకి తీసుకున్నామని రాచకొండ సీపీ డీఎస్ చౌహాన్ పేర్కొన్నారు. మరో నిందితుడు పరారీలో ఉన్నట్లు ఆయన తెలిపారు.
మధ్యప్రదేశ్లోని తికమ్గఢ్ జిల్లాలో టమాటాలను ఎత్తుకెళ్లిన ఉదంతం తెరపైకి వచ్చింది. కొందరు గుర్తు తెలియని వ్యక్తులు టమోటాలతో ఉన్న వాహనంలోని డ్రైవర్ను కొట్టి తీసుకెళ్లారు.
రాబోయే G20 సమ్మిట్ కోసం సెప్టెంబర్ 8-10 వరకు పబ్లిక్ హాలిడే ప్రకటించాలని ఢిల్లీ పోలీసులు కోరుతున్నారు. ఈ నేపథ్యంలో సిఫార్సు చేస్తూ ఢిల్లీ పోలీస్ స్పెషల్ కమిషనర్ ఢిల్లీ చీఫ్ సెక్రటరీకి లేఖ రాశారు.
ఉత్తరప్రదేశ్లోని సీతాపూర్ జిల్లాలో మూకుమ్మడి హత్య ఘటన వెలుగు చూసింది. దొంగతనం చేయాలనే ఉద్దేశ్యంతో ఓ ఇంట్లోకి ప్రవేశించిన ముగ్గురు దొంగలను గ్రామస్థులు చితకబాదారు. ఈ ఘటనలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా.. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.