సైబర్ నేరగాళ్లు జనాలను దోచుకునేందుకు ఎప్పటికప్పుడు తమ రూట్ మార్చుకుంటున్నారు. అయితే, ఈ మధ్య ట్రాఫిక్ చలాన్లకు సంబంధించిన ఈ-చలాన్ల పేరిట కొత్త రకం మోసానికి తెరదీశారు. ఈ-చలాన్ల పేరుతో వాహనదారులకు వ్యక్తిగత ఎస్ఎమ్ఎస్ లు పంపి వారిని బురిడీ కొట్టిస్తున్నారు.
అతిగా ఫోన్ చేస్తుందని తండ్రి కూతురు మందలించినందుకు మనస్థాపానికి లోనై పదవ తరగతి విద్యార్థి పురుగుల మందు తాగి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన ఘటన వికారాబాద్ జిల్లా యాలాల మండలం పగిడాల గ్రామంలో జరిగింది.
ఈ సంవత్సరం వినాయక చవిత ఉత్సవాలపై భాగ్యనగర్ ఉత్సవ సమితి కీలక ప్రకటన చేసింది. ఈనెల 19వ తారీఖున సాంప్రదాయబద్దంగా గణేష్ పండుగ నిర్వహించుకోవాలని తెలిపింది.
ఛత్తీస్‌గఢ్‌లోని ధామ్తరి జిల్లా ఏక్వారీ అడవుల్లో భద్రతా బలగాలు-మావోయిస్టుల మధ్య కాల్పులు జరిగాయి. ఈ ఎన్కౌంటర్ లో పోలీసులు ఓ నక్సలైట్ ను హతం చేశారు. గంటల తరబడి ఈ కాల్పులు కొనసాగాయి. మరోవైపు ఘటనా స్థలం నుంచి పోలీసులు రెండు రైఫిళ్లు, మావోయిస్టులు ఉపయోగించే సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు.
సీఆర్పీఎఫ్ హెడ్ కానిస్టేబుల్ గా పని చేస్తున్నా.. ఓ జవాన్.. ఆయన భార్య కూడా ప్రభ్వుత్వ ఉద్యోగిణి.. కానీ ఆమె ఉద్యోగం చేయడం అతడికి ఇష్టం లేదు.. అయినా ఆమె రోజూ డ్యూటీకి వెళ్తుంది. ప్రమోషన్ కోసం పరీక్ష రాసేందుకు కూడా రెడీ అయింది. పరీక్ష రాసేందుకు వేరే ప్రాంతానికి వెళ్లి హోటల్ రూమ్ లో ఉండగా.. ఆ టైంలో అక్కడికి వచ్చిన భర్త ఆమె అర చేయి నరికేసి వెళ్లిపోయాడు.
బీహార్ లో కాల్పులు కలకలం రేపుతున్నాయి. సమస్తిపూర్ సివిల్ కోర్టు ప్రాంగణం బుల్లెట్ల మోతతో మారుమోగింది. గుర్తుతెలియని దుండగులు పోలీసులకు బహిరంగ సవాల్ విసిరి ఇద్దరు ఖైదీలపై కాల్పులు జరిపారు.
ఆంజనేయులు తప్పిపోయి 6 రోజులు అవుతున్నా.. పేరెంట్స్ కి సమాచారం చేయని కాలేజ్ యాజమాన్యం.. 6 రోజులుగా తమ కొడుకు ఫోన్ చేయడం లేదని.. తొటి విద్యార్థులకు ఫోన్ చేసిన పేరెంట్స్.. మీ అబ్బాయి మిస్ అయ్యాడు అని చెప్పిన ఆంజనేయులు ఫ్రెండ్స్.. దీంతో కంగారుగా కాలేజ్ కి చేరుకున్న పేరెంట్స్, బంధువులు.. కాలేజ్ ఎదుట ఆందోళన చేశారు.
వికారాబాద్ జిల్లాలో ఈనెల 21న తాండూర్ మోర్ సూపర్ మార్కెట్లో షెటర్ లిఫ్ట్ చేసి దొంగతనానికి పాల్పడ్డ అంతరాష్ట్ర దొంగల ముఠాను పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా పట్టుకున్నారు. ఈ చోరీ కేసును పోలీసులు కేవలం నాలుగు రోజుల్లో చేధించారు. ఈ దొంగతనంకు సంబంధించిన వివరాలను తాండూర్ డీఎస్పీ శేఖర్ గౌడ్ వెల్లడించారు.