Crime: ఉద్యోగం చేయొద్దని భార్య చేయి నరికిన సీఆర్పీఎఫ్ జవాన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఢిల్లీలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. సీఆర్పీఎఫ్ హెడ్ కానిస్టేబుల్ గా పని చేస్తున్నా.. ఓ జవాన్.. ఆయన భార్య కూడా ప్రభ్వుత్వ ఉద్యోగిణి.. కానీ ఆమె ఉద్యోగం చేయడం అతడికి ఇష్టం లేదు.. అయినా ఆమె రోజూ డ్యూటీకి వెళ్తుంది. ప్రమోషన్ కోసం పరీక్ష రాసేందుకు కూడా రెడీ అయింది. పరీక్ష రాసేందుకు వేరే ప్రాంతానికి వెళ్లి హోటల్ రూమ్ లో ఉండగా.. ఆ టైంలో అక్కడికి వచ్చిన భర్త ఆమె అర చేయి నరికేసి వెళ్లిపోయాడు.
Read Also: Blind Cricket: వరల్డ్ ఛాంపియన్‌గా పాక్.. ఫైనల్లో టీమిండియా ఓటమి
Also Read
- Road Accident: లారీ-ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీ.. బస్సులో 30 మంది ప్రయాణికులు.?
- GST Scam: భారీ జీఎస్టీ స్కామ్.. అమాయకుల పత్రాలతో కోట్ల లావాదేవీలు.!
- Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
- KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
ఉత్తర్‌ప్రదేశ్‌లోని కాన్పుర్ కు చెందిన సతీష్ కుమార్ కుష్వాహా సీఆర్పీపీఎఫ్ హెడ్ కానిస్టేబుల్ గా డ్యూటీ చేస్తున్నాడు. అతడి భార్య ప్రభుత్వ ఉద్యోగిగా పని చేస్తున్నారు. తన భార్య ఉద్యోగం చేయడం సతీష్ కుమార్ కు ఇష్టం లేదు.. అయినా ఆమె ప్రతీ రోజు డ్యూటీకి వెళ్తుంది. ఈ క్రమంలో ఆమె ప్రమోషన్ కు అర్హత పొందేందుకు పరీక్ష రాయాలని ఢిల్లీకి శుక్రవారం మధ్యాహ్నం భర్తతో కలిసి వెళ్లింది.
Read Also: What’s Today : ఈ రోజు ఏమున్నాయంటే..?
అయితే, ఆదర్శ్ నగర్ లోని ఓ చిన్న హోటల్ లో వీరిద్దరు ఓ అద్దె గదిని తీసుకున్నారు. ఇక, వారి మధ్య ఉద్యోగం విషయంలో గొడవ స్టార్ట్ అయింది. కొంత సమయం తరువాత ఆ గొడవ సద్దుమణిగింది.. దీంతో హోటల్ సిబ్బంది ద్వారా ఈ జంట భోజనం తెప్పించుకున్నారు.. అయితే, సతీష్ కుమార్.. భార్యకు తెలియకుండా అందులో మత్తు మందు కలిపాడు. అది తిన్న తరువాత ఆమె స్పృహ కోల్పోయింది. దీంతో ఆమెను మంచానికి కట్టేసి అరచేయి నరికాడు.
Read Also: Astrology: ఆగస్టు 27, ఆదివారం దినఫలాలు
అనంతరం అక్కడి నుంచి సతీష్ కుమార్ పారిపోయాడు. ఈ నొప్పితో ఆమె స్పృహలోకి వచ్చింది.. లేచి చూసి తన పరిస్థితి అర్థం చేసుకుని.. గట్టిగా కేకలు వేయడంతో హోటల్ సిబ్బంది వచ్చారు. వెంటనే ఈ విషయాన్ని పోలీసులకు తెలిపారు. బాధితురాలిని స్థానిక హాస్పిటల్ కు తరలించారు. అక్కడి డాక్టర్లు గంటల తరబడి ఆపరేషన్ చేసి, ఆమె చేతిని తిరిగి అతికించారు.
Read Also: Gold Price Today: ఇవాళ తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి రేట్లు ఇవే..!
ఈ ఘటపై ఐపీసీ సెక్షన్ 307 కింద కేసు నమోదు చేశామని, నిందితుడిని పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపట్టామని డీప్యూటీ పోలీస్ కమిషనర్ జితేంద్ర కుమార్ మీనా పేర్కొన్నారు. కాగా.. నిందితుడు గతంలో కూడా ఉత్తరప్రదేశ్ లోని ఓ మహిళపై దాడి చేసినట్టు ఆరోపణలు ఉన్నాయి. ఆ దాడి విషయంలో అతడితో పాటు సోదరుడిపై కూడా ఎఫ్ఐఆర్ నమోదైందని యూపీ పోలీసులు చెప్పారు.
తాజావార్తలు
-
Road Accident: లారీ-ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీ.. బస్సులో 30 మంది ప్రయాణికులు.?
-
GST Scam: భారీ జీఎస్టీ స్కామ్.. అమాయకుల పత్రాలతో కోట్ల లావాదేవీలు.!
-
Russia Mystery Pneumonia: రష్యాలో మిస్టరీ న్యూమోనియా కలకలం.. ల్యాబ్ ఉద్యోగి మృతి, 197 మందికి క్వారంటైన్
-
Kash Patel Engaged: FBI డైరెక్టర్ కాష్ పటేల్‌కు ఎంగేజ్మెంట్.. ప్రియురాలు అలెక్సిస్ విల్కిన్స్ ఎవరు?
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
ట్రెండింగ్
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!