మియాపూర్ కాల్పుల కేసును పోలీసులు చేధించారు. దేవేందర్ పై కాల్పులు జరిపి చంపేసిన రిత్విక్ అలియాస్ తిలక్ ని పోలీసులు అరెస్ట్ చేశారు. వ్యక్తిగత కారణాలతోనే దేవేందర్ పై రిత్విక్ కాల్చి చంపినట్లు నిందితుడు తెలిపాడని పోలీసులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా మాదాపూర్ డీసీపీ సందీప్ మాట్లాడుతూ.. కలకత్తాకి చెందిన దేవేందర్.. గత 9 ఏళ్లుగా సందర్శిని హోటల్ లో మేనేజర్ గా పనిచేస్తున్నాడు.. అదే హోటల్ లో కేరళకి చెందిన రిత్విక్ నాయర్ మేనేజర్ గా చేరాడు.. ఆ హోటల్ లో జనరల్ మేనేజర్ పోస్ట్ ఖాళీ అయ్యింది.. ఈ పోస్ట్ కోసం ఇద్దరి మధ్య పోటీ వచ్చింది.. దేవేందర్ పని తీరు మంచిగా ఉండటంతో.. ఇతడికి జనరల్ మేనేజర్ గా హోటల్ యాజమాన్యం ప్రమోషన్ ఇచ్చింది అని మాదాపూర్ డీసీపీ తెలిపారు.
Read Also: Tollywood Shooting Updates: హైదరాబాద్లో ఎన్టీఆర్, మహేష్, అల్లు అర్జున్.. షూట్స్ ఎక్కడంటే?
దీంతో.. దేవేందర్ పై రిత్విక్ కోపం పెంచుకున్నాడు.. ఇద్దరి మధ్య తరుచూ గొడవ జరిగేది అని మాదాపూర్ డీసీపీ సందీప్ తెలిపారు. రిత్విక్ ప్రవర్తన బాగోలేకపోవడంతో.. అతడిని ఉద్యోగంలో నుంచి తొలగించారని ఆయన పేర్కొన్నారు. ఇక, దేవేందర్ పై కోపం పెంచుకున్న రిత్విక్.. ఎలాగైనా చంపాలి అనుకున్నాడు.. బీహార్ వెళ్ళి.. ఒక కంట్రీ మేడ్ పిస్టల్ కొన్నాడు.. దేవేందర్ హోటల్ నుంచి బయటకు వచ్చే టైంలో కాపు కాసి.. పక్కా ప్లాన్ ప్రకారం గన్ తో కాల్చి చంపేశాడు అని డీసీపీ సందీప్ చెప్పాడు.
Read Also: Sheikh Mohammed bin Rashid: చంద్రయాన్-3 విజయవంతంపై దుబాయ్ రాజు అభినందనల వెల్లువ
దేవేందర్ పై 5 రౌండ్లు కాల్పులను రిత్విక్ జరిపాడు.. 5 రౌండ్స్ బాడీలో దిగాయని మాదాపూర్ డీసీపీ సందీప్ తెలిపారు. ఆ తర్వాత మెట్రో ట్రైన్ లో పారిపోయేందుకు రిత్విక్ ప్రయత్నం చేశాడు.. అప్పటికే రిత్విక్ కోసం గాలిస్తున్న ప్రత్యేక టీమ్స్ అతడ్ని అదుపులోకి తీసుకున్నాయి.. కేవలం 8 గంటల్లోనే ఈ కేసును చేధించామని డీసీపీ సందీప్ చెప్పుకొచ్చారు.