ఉత్తరాఖండ్ రాష్ట్రంలో నైనిటాల్ జిల్లాలోని బన్‌భూల్‌పురా పట్టణంలో 'అక్రమ' మదర్సా కూల్చివేతపై హింసాత్మక ఘర్షణల నేపథ్యంలో విధించిన కర్ఫ్యూ తాత్కాలిక సడలించింది.
హర్యానా- పంజాబ్ రాష్ట్రాల నుంచి వేలాది మంది రైతులు తమ డిమాండ్లతో ఢిల్లీకి చేరుకుంటున్నారు. అయితే, రైతులను అడ్డుకునేందుకు ఢిల్లీ సరిహద్దులను పోలీసులు మూసివేశారు. అయితే, 2020 రైతు ఉద్యమంలో ప్రధాన పాత్ర పోషించిన భారతీయ కిసాన్ యూనియన్ అధికార ప్రతినిధి రాకేష్ టికాయిత్ ఈ ఉద్యమంలో మాత్రం కనిపించడం లేదు.
దేశ రాజధాని ఢిల్లీలోని సాకేత్ ప్రాంతంలోని ఓ స్కూల్ కు బెదిరింపు మెయిల్ తీవ్ర కలకలం రేపుతుంది. ఈ నెల 13వ తేదీన ఆ ప్రాంతంలోని అమిటీ ఇంటర్నేషనల్ స్కూల్‌ను పేల్చివేస్తామంటూ బాంబు హెచ్చరికతో కూడిన మెయిల్ రావడం తీవ్ర కలకలం రేపింది.
జమ్మూ కాశ్మీర్‌లోని రాంబన్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఓ మారుమూల గ్రామంలో ఇవాళ తెల్లవారు జామున ఇంటికి మంటలు అంటుకోవడంతో ముగ్గురు మైనర్ బాలికలు సజీవదహనం అయ్యారని పోలీసు అధికారులు తెలిపారు.
తిరుపతి పోలీసులపై ఎన్నికల సంఘం కొరడా ఝళిపించింది. తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికల వ్యవహారంలో కీలకంగా వ్యవహరించిన పలువురు పోలీసులపై వేటు వేసింది. అప్పటి ఈస్ట్ సీఐ శివప్రసాద్ రెడ్డి, వెస్ట్ సీఐ శివప్రసాద్ లను సస్పండ్ చేస్తూ ఆదేశాలు ఇచ్చింది. వీరితో పాటు తూర్పు ఎస్ఐ జయస్వాములు, హెడ్ కానిస్టేబుల్ ద్వారకానాథరెడ్డిలను సస్పెండ్ చేసింది. అలిపిరి సీఐ అబ్బన్నను వీఆర్ కు బదిలీ చేశారు. తిరుపతి ఎంపీ ఉప ఎన్నిక వేళ దొంగ ఓట్ల…
హైదరాబాద్ జూబ్లీహిల్స్ హనీ ట్రాప్ కేసులో 8 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. జూబ్లీహిల్స్ లో హనీ ట్రాప్ చేసి రాము సింగోటం అనే వ్యక్తిని ఓ ముఠా హత్య చేసింది. మహిళ ద్వారా ట్రాప్ చేయించి రాము సింగోటంని జూబ్లీహిల్స్ పిలిపించి.. జూబ్లీహిల్స్ కి వచ్చిన గోల్డ్ మాన్ రాము సింగోటంపై ముకుమ్మడిగా దాడి చేసి హత్య చేశారు. మహిళతో పాటు ఆమె కూతుర్ని లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు రాము సింగోటం. ఈ క్రమంలో.. రౌడీ…
హైదరాబాద్ నగరంలో దారుణం చోటు చేసుకుంది. యూసుఫ్ గూడలోని లక్ష్మీనరసింహనగర్ లో అర్ధరాత్రి హత్య జరిగింది. పాలమూరుకు చెందిన సింగోటం రాము అనే వ్యక్తి మర్మాంగాలతో పాటు గొంతు కోసి అతి కిరాతకంగా మర్డర్ చేశారు.