ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో దారుణమైన సంఘటన వెలుగులోకి వచ్చింది. 19 ఏళ్ల కుర్రాడు తన మైనర్ సోదరిని రేప్ చేసి హత్య చేసిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
మహారాష్ట్రలోని నవీ ముంబై ప్రాంతంలో రెండు కుటుంబాలకు చెందిన ఐదుగురు బాలికలు అదృశ్యమయ్యారు. ఈ ఘటన అక్కడ సంచలనంగా మారింది. కాగా.. మిస్సింగ్ అయిన బాలికల కోసం పోలీసులు వెతకడం ప్రారంభించారు. తలోజా ప్రాంతంలోని లక్కీ కాంప్లెక్స్‌లో బాలికలు శనివారం అదృశ్యమయ్యారు. అప్పటి నుంచి బాలికలను వెతికే పనిలో పోలీసులు నిమగ్నం కాగా.. మరోవైపు బాలికల తల్లిదండ్రులు తీవ్ర దు:ఖసాగరంలో మునిగిపోయారు.
ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని కాన్పూర్ దెహాత్ జిల్లాలోని సికంద్రా పోలీస్ స్టేషన్ పరిధిలోని జగన్నాథ్ పూర్ గ్రామ సమీపంలో ఇవాళ తెల్లవారు జామున ఈ ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.
గోబీ మంచురియా డిష్ పై గోవాలో భారీ గొడవలు జరుగుతున్నాయి. గోబీని అపరిశుభ్ర పరిస్థితుల్లో తయారు చేయడం వల్ల ఈ డిష్‌లో ప్రమాదకర కలర్స్ వాడటంతో పాటు దుస్తులు ఉతకడానికి ఉపయోగించే పౌడర్‌ను సాస్ తయారీలో ఉపయోగించడంపై అక్కడ తీవ్ర వ్యతిరేకత వచ్చింది.
విశాఖ రూరల్ తహశీల్దార్ రమణయ్య హత్య కేసులో కీలక ఆధారాలు లభ్యం అయ్యాయి. ఆర్ధిక లావాదేవీలే హత్యకు కారణంగా గుర్తించారు పోలీసులు. రుషికొండలోని అపార్ట్మెంట్స్ లోని ఫ్లాట్ లను 22ఏ నుంచి తప్పించేందుకు ఎమ్మార్వోతో మణికంఠ గంగారాం ఒప్పందం చేసుకున్నారు. ఒప్పందం మేరకు ఎమ్మార్వో, రియల్టర్ గంగారాం మధ్య ఆర్ధిక లావాదేవీలు జరిగినట్టు పోలీసులు గుర్తించారు. అయితే.. ఇరువురి మధ్య రుషికొండ అపార్ట్మెంట్స్ తో పాటు మరికొన్ని భూ వ్యవహారాల లావాదేవీలు జరిగాయి.