ఢిల్లీలో విద్యార్థి హత్య సంచలనం రేపుతుంది. ఈశాన్య ఢిల్లీలోని న్యూ ఉస్మాన్‌పూర్ ప్రాంతంలో ఓ ప్రైవేట్ స్కూల్‌లో 6వ తరగతి చదువుతున్న విద్యార్థిని 8వ తరగతి చదువుతున్న తోటి విద్యార్థి హత్య చేశాడు. అందుకు సంబంధించి 14 ఏళ్ల బాలుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పాఠశాల లోపల ఏదో చిన్న సమస్యపై వారిద్దరు గొడవ పడ్డారని.. దీంతో ఆరో తరగతి చదువుతున్న విద్యార్థి 8వ తరగతి విద్యార్థిని ముఖంపై కొట్టాడని పోలీసులు తెలిపారు.
Read Also: White Hair Home Remedies: తెల్లజుట్టు నల్లగా మారాలంటే.. వారానికి ఒకసారి ఇలా చేయండి..!
ఈ సంఘటన శుక్రవారం జరిగింది. వెంటనే విద్యార్థిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. కాగా.. సాయంత్రం 4 గంటలకు జెపిసి ఆసుపత్రి నుండి ఫోన్ వచ్చిందని పోలీసులు తెలిపారు. వెంటనే అక్కడి వెళ్లి చూడగా.. బాలుడి తల, ముఖం, ఎడమ చేతిపై గాయాలైనట్లు తెలిపారు. ఆ తర్వాత ఘటనాస్థలానికి కూడా వెళ్లి పరిశీలించగా.. అక్కడ రక్తపు మరుకలు కనిపించినట్లు పోలీసులు తెలిపారు. కాగా.. బాధిత విద్యార్థి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. అయితే.. బలమైన దెబ్బలు తాకడంతో ముక్కు నుంచి అధిక రక్తస్రావమై బాధిత విద్యార్థి మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. ఇదిలా ఉంటే.. పాఠశాలలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను పరిశీలించిన పోలీసులు.. 12 ఏళ్ల విద్యార్థిని గుర్తించారు. శుక్రవారం అర్థరాత్రి అతడిని పట్టుకున్నట్లు పోలీసులు తెలిపారు.
Read Also: IPL 2024: ఐపీఎల్ యాడ్ వీడియోలు లీక్.. హార్దిక్, పంత్ యాక్షన్ మాములుగా లేదు