మహారాష్ట్రలో మరోసారి రిజర్వేషన్ కోసం ఆందోళనలు కొనసాగుతున్నాయి. అంబాద్ తాలూకాలోని తీర్థపురి పట్టణంలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ చౌక్ దగ్గర మరాఠా నిరసనకారులు రాష్ట్ర రవాణా బస్సును తగులబెట్టినట్లు ఓ అధికారి వెల్లడించారు. ఈ ఘటనపై మహారాష్ట్ర స్టేట్ రోడ్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ (MSRTC) పోలీసులకు కంప్లైంట్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో జల్నా ఏరియాలో బస్సు సేవలను బంద్ చేసింది.
Read Also: Alleti Maheshwar Reddy: ఖమ్మం గుమ్మంలో ఎగిరేది కమలం జెండానే..
అయితే, మరాఠా ఆందోళనకారులు బస్సును తగులబెట్టారని ఆరోపిస్తూ ఎంఎస్‌ఆర్టీసీ అంబాద్ డిపో మేనేజర్ స్థానిక పోలీస్ స్టేషన్‌లో పోలీసు ఫిర్యాదు ఇచ్చాడు. ఇక, ఈ నెల ప్రారంభంలో ప్రవేశ పెట్టిన మరాఠా రిజర్వేషన్ బిల్లును మహారాష్ట్ర శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. మరాఠాలకు 50 శాతం పరిమితికి మించి అదనంగా 10 శాతం రిజర్వేషన్లు కల్పించనున్నారు. అయితే, ఫిబ్రవరి 20వ తేదీన అసెంబ్లీలో ఈ బిల్లు ఆమోదం పొందిన తర్వాత కూడా మరాఠా రిజర్వేషన్ ఉద్యమకారుడు మనోజ్ జరంగే పాటిల్ తన దీక్షను కొనసాగించారు. పైగా ఈ ఆర్డినెన్స్ నోటిఫికేషన్‌ను రెండు రోజుల్లోనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఫిబ్రవరి 24న రాష్ట్రంలో మరో ఉద్యమం ఆరంభమైంది. తాజాగా మనోజ్ జరంగే మాట్లాడుతూ.. మరాఠా కమ్యూనిటీకి అందిస్తున్న రిజర్వేషన్ సంతృప్తికరంగా లేదన్నారు.