Army employee: హైదరబాద్ నగర శివారులోని నార్సింగ్ లో హిట్ అండ్ రన్ ఘటన ఈ రోజు చోటు చేసుకుంది. అయితే, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఔటర్ రింగ్ రోడ్డు క్రాస్ చేస్తున్న ఓ ఆర్మీ ఉద్యోగి కునాల్ ను గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టగా అక్కడిక్కడే మృతి చెందినట్లు తెలిపారు. ఇక, ఢీ కొట్టిన తర్వాత వాహనం ఆపకుండా వెళ్లిపోయింది.. గచ్చిబౌలి నుంచి ఎయిర్ పోర్టుకు వెళ్లుండగా ఈ ప్రమాదం జరిగింది. నార్సింగ్ పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని, సీసీ టీవీ పుటేజీ ఆధారంగా విచారణ చేస్తున్నారు.
Read Also: Udhayanidhi Stalin: స్టార్ హీరోకు మొట్టికాయలు వేసిన సుప్రీం కోర్టు.. అసలేం జరిగిందంటే?
అయితే, మృతుడు ఆర్మీ ఉద్యోగి కునాల్ గోల్కొండ ఆర్టలరీ సెంటర్ లో విధులు నిర్వహిస్తున్నాడు.. ఔటర్ రింగ్ రోడ్ వైపు ఎందుకు వచ్చాడు అనే సమాచారాన్ని పోలీసులు సేకరిస్తున్నారు. ఇక, హింట్ అండ్ రన్ కేసులో పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ ఘటనతో నార్సింగ్ పోలీస్ స్టేషన్ కు ఆర్మీ అధికారులు చేరుకుని వివరాలు అడిగి తెలుసుకున్నారు. అయితే, రోడ్డుపై రక్తపు మడుగులో పడి ఉన్న ఆర్మీ సోల్జర్ కునాల్ మృతదేహం పక్క నుంచే చాలా వాహనాలు వెళ్ళాయి. కానీ, ఏ ఒక్క వాహనదారుడు కూడా ఆపలేదు.. కనీసం పోలీసులకు, అంబులెన్స్ కు కూడా సమాచారం ఇవ్వలేదు అని వారు ఆవేదన వ్యక్తం చేశారు. కునాల్ ను రెడీ మిక్సర్ వెహికిల్ ఢీ కొన్నట్లుగా నార్సింగి పోలీసులు గుర్తించారు. దీంతో వెంటనే లారీని గుర్తించి డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్నారు.