ర్ణాటక రాష్ట్రంలోని ముల్బాగల్ పట్టణంలో టిఫిన్ పెట్టలేదని ఓ బాలుడు తన తల్లిని చంపేశాడు. ఆ తర్వాత ఈ విషయాన్ని నేరుగా పోలీస్ స్టేషన్ కు అక్కడ ఉన్న పోలీసులకు తెలియజేశాడు.
మహారాష్ట్రలో షాకింగ్ సంఘటన చోటు చేసుకుంది. సీఎం ఏక్నాథ్ షిండే వర్గానికి చెందిన శివసేన నేతపై బీజేపీ ఎమ్మెల్యే కాల్పులకు దిగాడు. ఈ ఘటనలో సదరు శివసేన నేత తీవ్ర గాయల పాలయ్యాడు.
ప్రియుడితో కలిసి భర్తను హత మార్చింది భార్య. హైదరాబాద్ లోని జవహర్ నగర్ లో గత కొంతకాలంగా భర్త స్వామి, భార్య కావ్య నివాసముంటున్నారు. ఈ క్రమంలోనే ఓ కారు డ్రైవర్ తో అక్రమసంబంధం పెట్టుకున్న కావ్య.. ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసింది. అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని.. భర్తను కిరాతకంగా చంపింది. పథకం ప్రకారం భర్తను ప్రియుడితో కలిసి కిడ్నాప్ చేసి నిజామబాద్ లో చంపింది భార్య. అనంతరం భర్త మృతదేహంను జవహర్ నగర్…
ఢిల్లీలో ఆప్, బీజేపీల ప్రదర్శన కారణంగా సెంట్రల్ ఢిల్లీతో పాటు రాజధానిలోని పలు ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ఈ నిరసనలను దృష్టిలో ఉంచుకుని ఢిల్లీ పోలీసులు బారికేడ్లు వేసి పలు రహదారులను మూసి వేశారు. దీంతో ప్రత్యామ్నాయ మార్గాల్లో వాహనాల రద్దీ పెరగడంతో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.
ఛండీఘర్ మేయర్ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఓటమి పాలైంది. దీంతో ఆప్ పార్టీ ఆందోళనలకు పిలుపునిచ్చింది. మేయర్ ఎన్నికల్లో బీజేపీ మోసం చేసి విజయం సాధించిందని కేజ్రీవాల్ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు.
రంగారెడ్డి జిల్లా మీర్ పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని టీచర్స్ కాలనీలో దారుణం చోటు చేసుకుంది. ది బాబ్ హెయిర్ అండ్ బ్యూటీ ఫ్యామిలీ సెలూన్ లో శానిటైజర్ తాగి యువతి ఆత్మహత్య చేసుకుంది. మృతురాలు దివ్య నల్లగొండ జిల్లా దేవరకొండకు చెందినదిగా పోలీసులు గుర్తించారు.
తిరుపతిలో హీరో ధనుష్ సినిమా షూటింగ్ కు సంబంధించి రేపటి అనుమతిని రద్దు చేశారు తిరుపతి ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి. భక్తుల మనోభావాలను దృష్టిలో ఉంచుకుని రద్దు చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. కాగా.. రేపు గోవింద రాజస్వామి ఆలయం వద్ద షూటింగ్ చేసి తీరుతామని చిత్ర యూనిట్ ప్రకటించింది. షూటింగ్ చేస్తే అడ్డుకుంటామని, భక్తుల మనోభావాలతో ఆడుకోవద్దని బీజేపీ వార్నింగ్ ఇచ్చింది. కాగా.. ఈ వివాదం పెద్దది కావడంతో రేపటి సినిమా షూటింగ్ కు పోలీసులు అనుమతి…
జేఏ యాడ్స్ అనే అమెరికన్ బేస్డ్ ఐటీ కంపెనీలో ఏపీ సీఐడీ అధికారులమంటూ కంపెనీలోకి పది మంది వెళ్లినట్లు మాదాపూర్ డీసీపీ తెలిపారు. ఐటీ కంపెనీ యజమాని దగ్గర నుంచి దాదాపు 10 కోట్ల రూపాయలను నకిలీ ఏపీ సిఐడి అధికారులు డిమాండ్ చేసినట్లు పేర్కొన్నారు.