AP Crime: తూర్పుగోదావరి నల్లజర్ల మండలం పోతవరంలో భారీ దారిదోపిడికి తెగబడ్డారు దొంగలు. భీమవరం చెందిన ఇద్దరు బంగారు వ్యాపారులు జంగారెడ్డిగూడెం వ్యాపార లావాదేవీలు ముగించుకుని తిరిగి వెళ్తుండగా గుర్తుతెలియన వ్యక్తులు మరోకారుతో అడ్డుపడ్డారు. తాము ఆదాయపన్ను శాఖ అధికారులమంటూ వారిని నమ్మించారు.. ఆ తర్వాత వ్యాపారులను తమ కారులో ఎక్కించుకుని రాజమండ్రి వైపు తీసుకెళ్లారు.. ఇక, వ్యాపారులు ప్రయాణించిన కారును తమ ఆధీనంలోకి తీసుకున్నారు కేటుగాళ్లు.. వారి కారులో మరో ఇద్దరు దొంగలు వెనుకాలే వస్తున్నట్టు నటించారు.. కారులోని నగదు, బంగారాన్ని అపహరించుకుపోయారు. దీంతో, బాధితులు నల్లజర్ల పోలిసులను ఆశ్రయించారు. రంగంలోకి దిగిన పోలీసులు దొంగలను పట్టుకునేందుకు ప్రత్యేక బలగాలను ఏర్పాటు చేశారు.. ఆరు బృందాలుగా ఏర్పడి నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. పక్క పధకం ప్రకారమే దొంగలు దోపిడికి పాల్పడినట్టు గుర్తించిన పోలీసులు.. నిందితులను త్వరలోనే పట్టుకుంటామని చెబుతున్నారు.
Read Also: Tammineni: పొత్తు ఉన్నా లేకున్నా రెండు స్థానాల్లో పోటీ చేస్తాం..