బుధవారం నాడు రాంబన్ జిల్లాలో కొండచరియలు విరిగిపడటంతో జమ్మూ-శ్రీనగర్ జాతీయ రహదారిని బ్లాక్ చేసినట్లు అధికారులు తెలిపారు. కాశ్మీర్ను దేశంలోని ఇతర ప్రాంతాలతో కలిపే ఏకైక రహదారి లింక్ అయిన 270 కిలోమీటర్ల జమ్మూ-శ్రీనగర్ హైవేపై అనేక చోట్ల భారీ కొండచరియలు విరిగిపడటంతో రాక్ఫాల్ల కారణంగా వందలాది వాహనాలు నిలిచిపోయాయి.
ఢిల్లీలో రైతులు మళ్లీ పోరుబాట పడుతున్నారు. మొత్తం 23 వాణిజ్య పంటలకు కనీస మద్దతు ధర గ్యారెంటీ చట్టం తీసుకురావాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీ ఛలో చేపట్టేందుకు రెడీ అయ్యారు.
విశాఖపట్నంలో నకిలీ కరెన్సీ నోట్లు చెలామణి జోరుగా సాగుతుంది. తాజాగా, నగరంలో బ్లాక్ కరెన్సీ ముఠా గుట్టురట్టు అయింది. నకిలీ కరెన్సీ చేస్తున్న ముఠా సభ్యులను పోలీసులు అరెస్ట్ చేశారు. నల్ల కాగితలను కరెన్సీ నోట్లుగా మారుస్తామంటూ మోసం చేశారు. బ్లాక్ కరెన్సీ ముఠాను టాస్క్ ఫోర్స్, స్పెషల్ బ్రాంచ్ పోలీసులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.
హైదరాబాద్ లో పంటి చికిత్సకు వెళ్లి ఓ వ్యక్తి బలయ్యాడు. వింజం లక్ష్మీనారాయణ అనే వ్యక్తి జూబ్లీహిల్స్ రోడ్ నెం.37లో ఎఫ్ఎంఎస్ ఇంటర్నేషనల్ డెంటల్ క్లినిక్లో దంత చికిత్స పొందుతూ మరణించాడు. అయితే.. దంత వైద్యుడి నిర్లక్ష్యంగా కారణంగా మృతి చెందాడని కుటుంబీకులు ఆరోపిస్తున్నారు. అనస్థీషియా ఎక్కువ మోతాదులో ఇవ్వడమే లక్ష్మీనారాయణ మరణానికి కారణమైందని అంటున్నారు.
శ్రీశైలం దేవస్థాన పరిధిలోని గౌరీ సదనంలో ఇద్దరు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. 137 రూమ్లో వాళ్లు చనిపోయి ఉన్నారు. శ్రీశైలం మల్లన్న దర్శనానికి వచ్చిన మల్లేష్ అనే వ్యక్తి.. ఈనెల 13న రూమ్ తీసుకున్నట్లు ఎంట్రీ బుక్లో నమోదు చేశారు. అయితే పక్కన గదిలో ఉన్న యాత్రికులు దుర్గంధం వస్తుందని ఆలయ అధికారులకు చెప్పడంతో ఈ విషయం బయట పడింది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు, దేవస్థానం అధికారులు.. సంఘటన స్థలానికి చేరుకొని ఘటనపై ఆరా…
ఎంవీవీ, వంశీ మధ్య వివా దం కొత్తది కాకపోయినా బహిరంగంగా ఆయన చేసిన తీవ్ర వ్యాఖ్యలు సంచలనం అయ్యాయి. సిట్టింగ్ ఎంపీపై ఎమ్మెల్సీ ప్రయోగించిన భాష చర్చనీయాంశంగా మారింది. మరోవైపు.. ఎమ్మెల్సీ వంశీ తీవ్రపదజాలంపై ఎంపీ ఎంవీవీ సత్యన్నారాయణ స్ట్రాంగ్ గా రియాక్ట్ అయ్యారు. వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగించారని ఎంవీపీ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. తనను అవమానించినందుకు చర్యలు తీసుకోవాలని కోరారు ఎంవీవీ.