Massive Landslide: బుధవారం నాడు రాంబన్ జిల్లాలో కొండచరియలు విరిగిపడటంతో జమ్మూ-శ్రీనగర్ జాతీయ రహదారిని బ్లాక్ చేసినట్లు అధికారులు తెలిపారు. కాశ్మీర్‌ను దేశంలోని ఇతర ప్రాంతాలతో కలిపే ఏకైక రహదారి లింక్ అయిన 270 కిలోమీటర్ల జమ్మూ-శ్రీనగర్ హైవేపై అనేక చోట్ల భారీ కొండచరియలు విరిగిపడటంతో రాక్‌ఫాల్‌ల కారణంగా వందలాది వాహనాలు నిలిచిపోయాయి. గత మూడు రోజులుగా అనేక చోట్ల కొండచరియలు విరిగిపడటంతో సోమవారం హైవే మూసివేశారు. ఇక, రహదారిని పునరుద్ధరించే ప్రయత్నాలు విజయవంతం కాలేదు అని అధికారులు చెప్పారు. బనిహాల్-రాంబన్ సెక్టార్‌లో చిక్కుకుపోయిన వాహనాలను క్లియర్ చేయడానికి బుధవారం మధ్యాహ్నం ట్రాఫిక్ పాక్షికంగా పునరుద్ధరించబడింది. అయితే, కిష్త్వారీలో భారీ కొండచరియలు విరిగిపడటంతో హైవే మళ్లీ బ్లాక్ చేయబడిందని అధికారులు చెప్పారు.
Read Also: FDI in Space : అంతరిక్ష రంగంలో పెట్టుబడులకు ద్వారాలు తెరిచిన కేంద్రప్రభుత్వం
ఇక, భారీ హిమపాతం కారణంగా శ్రీనగర్-లడఖ్ మార్గంలో కుప్వారా- గురెజ్‌లోని నియంత్రణ రేఖ (ఎల్‌ఓసి) ప్రాంతాలను కలిపే రహదారులతో సహా అనేక ఇతర ప్రధాన రహదారులు కూడా మూసివేయబడ్డాయి. కిష్త్వారీ పథేర్, బనిహాల్ వద్ద పెద్ద కొండచరియలు విరిగిపడటంతో నష్రీ, బనిహాల్ మధ్య అనేక ప్రదేశాలలో అడపాదడపా కొండ చర్యలు విరిగిపడటంతో జమ్మూ-శ్రీనగర్ జాతీయ రహదారి ఇప్పటికీ క్లోజ్ చేశారని ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. ఇక, ట్రాఫిక్ క్లియర్ అయ్యేంత వరకు జాతీయ రహదారి-44 (NH-44)లో ప్రయాణించకుండా ఉండాలని ప్రజలకు సూచించినట్లు పోలీసులు తెలిపారు. కాశ్మీర్‌లోని అనేక ప్రాంతాలలో హిమపాతం భారీగా కురుస్తుండటంతో ఇప్పటికే అధికారులు హెచ్చరికలను కూడా జారీ చేశారు.
Read Also: Medaram Tourists: లక్నవరం సందర్శనలకు బ్రేక్.. కారణం ఏమిటంటే?
అలాగే, ఎత్తైన ప్రాంతాలలో నివసించే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జమ్మూ-కాశ్మీర్ పోలీసులు సూచించారు. నిన్న సోనామార్గ్ ప్రాంతంలోని సింధ్ నదిలో భారీ హిమపాతం కురిసింది. నది తన గమనాన్ని మార్చుకుని పక్కనే ఉన్న శ్రీనగర్-లడఖ్ రహదారిపై ప్రవహించింది. అయితే, నది నీటిని దాని అసలు మార్గంలోకి తిరిగి రావడానికి హిమపాతాన్ని క్లియర్ చేయడానికి అధికారులు యంత్రాలను ఉపయోగించారు. ట్రాఫిక్ కంట్రోల్ యూనిట్ల నుంచి రోడ్డు పరిస్థితులను నిర్ధారించుకున్న తర్వాతే ప్రజలు NH-44లో ప్రయాణించాలని పోలీసులు తెలిపారు.