తిరుమలలో కిడ్నాప్ కు గురైన మూడేళ్ల చిన్నారి ఘటన సుఖాంతమైంది. ఈరోజు మధ్యాహ్నం ఓ మహిళ చిన్నారిని కిడ్నాప్ చేసినట్లు సీసీ టీవీ ఫుటేజ్ లో వెల్లడైంది. తెలంగాణలోని గద్వాల్ జిల్లాకు చెందిన అభినయ్ అనే మూడేళ్ల చిన్నారిని ఓ మహిళ అపహరించింది. యాత్రికుల వసతి సముదాయం 2 వద్ద చిన్నారిని ఎత్తుకెళ్లింది. దీంతో హుటాహుటిన చిన్నారి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీసీ ఫుటేజీ ఆధారంగా బాలుడి ఆచూకీ కోసం గాలించారు. సాయంత్రం 5 గంటల…
ఒరిస్సా రాష్ట్రానికి చెందిన నిరుద్యోగులకు విజయనగరంలోని లైఫ్ లైన్ ఏజెన్సీ టోకరా వేసింది. సుమారు 125 మంది నుంచి 75 లక్షల రూపాయలను వసూలు చేసినట్లు తెలుస్తుంది.
హైదరబాద్ నగర శివారులోని నార్సింగ్ లో హిట్ అండ్ రన్ ఘటన ఈ రోజు చోటు చేసుకుంది. అయితే, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఔటర్ రింగ్ రోడ్డు క్రాస్ చేస్తున్న ఓ ఆర్మీ ఉద్యోగి కునాల్ ను గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టగా అక్కడిక్కడే మృతి చెందినట్లు తెలిపారు.
సూర్యాపేట జిల్లా కేంద్రానికి సమీపంలో ఇవాళ ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. మోతేకు దగ్గరలో హైదరాబాద్- విజయవాడ జాతీయ రహదారిపై ఓ బస్సు ఆటోను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలోని ముగ్గురు అక్కడికక్కడే చనిపోయినట్లు స్థానికులు తెలిపారు.
హైదరాబాద్ నగరంలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. మంగళవారం నాడు అర్థరాత్రి సమయంలో పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హెచ్ఏఎల్ రాఘవేంద్ర కాలనీకి దగ్గరలో ఉన్న ఫ్రూట్స్ స్టాల్, మటన్ దుకాణం, స్క్రాప్ దుకాణాల్లో ఒక్కసారిగా ప్రమాదం సంభవించింది.
మహారాష్ట్రలో మరోసారి రిజర్వేషన్ కోసం ఆందోళనలు కొనసాగుతున్నాయి. అంబాద్ తాలూకాలోని తీర్థపురి పట్టణంలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ చౌక్ దగ్గర మరాఠా నిరసనకారులు రాష్ట్ర రవాణా బస్సును తగులబెట్టినట్లు ఓ అధికారి వెల్లడించారు.
Guntur : ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లాలో హృదయ విదారక ఘటన వెలుగు చూసింది. ఇక్కడ ఓ రైతును హత్య చేసి మృతదేహాన్ని పొలంలో పడేశారు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. మృతుడి చేతి గోళ్లు మాయమయ్యాయి.
ఢిల్లీలో విద్యార్థి హత్య సంచలనం రేపుతుంది. ఈశాన్య ఢిల్లీలోని న్యూ ఉస్మాన్పూర్ ప్రాంతంలో ఓ ప్రైవేట్ స్కూల్లో 6వ తరగతి చదువుతున్న విద్యార్థిని 8వ తరగతి చదువుతున్న తోటి విద్యార్థి హత్య చేశాడు. అందుకు సంబంధించి 14 ఏళ్ల బాలుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పాఠశాల లోపల ఏదో చిన్న సమస్యపై వారిద్దరు గొడవ పడ్డారని.. దీంతో ఆరో తరగతి చదువుతున్న విద్యార్థి 8వ తరగతి విద్యార్థిని ముఖంపై కొట్టాడని పోలీసులు…