విజయవాడలో దారుణం చోటుచేసుకుంది. అజిత్ సింగ్ నగర్ ప్రాంతంలోని ఓ ఇంట్లో పిల్లలతో కలిసి నిద్రపోతున్న మహిళపై ఎదురింట్లో నివాసముండే ఓ వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. అయితే భర్తను అడ్డుకోవాల్సిన భార్య ఆ పని చేయకుండా… ఈ పాడు పనిని వీడియో తీయడం కలకలం రేపుతోంది. ఈ ఘటన ఈనెల 3న జరిగినట్లు తెలుస్తోంది. నిందితుడు దిలీప్ అని.. వీడియో తీసిన అతడి భార్య తులసి అని పోలీసులు వెల్లడించారు.
Read Also: వాలంటీరే కాలయముడు.. కల్తీ కల్లు మరణాల కేసులో వీడిన మిస్టరీ
ఈనెల 3న బాధిత మహిళ నిద్రపోతున్న సమయంలో ఎదురింట్లో ఉండే దిలీప్, అతడి భార్య తులసి వచ్చి మహిళ నోరు గట్టిగా మూసి తమ ఇంట్లోకి లాక్కెళ్లారు. మహిళపై నిందితుడు రెండుసార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ తతంగాన్ని నిందితుడు దిలీప్ భార్య తులసి వీడియోలు, ఫోటోలు తీసింది. ఆ తర్వాతి రోజు ఈ వీడియోలను చూపించి మరోమారు నిందితుడు బాధితురాలిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే పిల్లలను చంపేస్తానని, ఫొటోలు బయటపెట్టి పరువు తీస్తానని హెచ్చరించాడు. తాజాగా తన స్నేహితుల కోరిక కూడా తీర్చాలని నిందితుడు పదే పదే వేధిస్తుండటంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. మహిళ ఫిర్యాదుతో పోలీసులు నిందితులపై 376(2), 354బి, 354డి, 109 సెక్షన్‌ల కింద కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.