నిజామాబాద్ జాతీయ రహదారి పై కరెన్సీ నోట్లు కలకలం రేపాయి. నోట్లని తుక్కు గా మార్చి తగలబెట్టినట్టు ప్రచారం జరుగుతోంది. ఈ నోట్లు భారీగానే వున్నట్టుగా చెబుతున్నారు. జిల్లాలోని బుస్సాపూర్ గ్రామ శివారు జాతీయ రహదారి పక్కనే కనపడిన దృశ్యాలు వైరల్ అవుతున్నాయి. దీనిపై సమగ్ర విచారణ చేస్తున్నారు పోలీసులు. ఒక వాహనం నుండి సంచి పడిపోయినట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు. జాతీయ రహదారిపై తగలబెట్టినవి దొంగ నోట్లా అసలు నోట్లా అనే దానిపై విచారణ జరుగుతోంది. జాతీయ…
గుంటూరు జిల్లాలో నకిలీ కరెన్సీ నోట్లు కలకలం రేపుతున్నాయి. కొందరు వ్యక్తులు కరెన్సీ నోట్లను కలర్ జిరాక్సు తీసి చలామణి చేస్తున్నారు. దీంతో దొంగనోట్ల ముఠా గుట్టును పోలీసులు కనిపెట్టారు. ముఖ్యంగా మేడికొండూరు, నడికుడి ప్రాంతాల్లో కొందరు వ్యక్తులు ముఠాగా ఏర్పడి కలర్ జిరాక్స్ ద్వారా నకిలీ నోట్లు తయారుచేస్తున్నారు. ముఖ్యంగా రూ.500, రూ.200 నోట్లు ముద్రించి సుమారు రూ.2.2 లక్షల మేర తెలుగు రాష్ట్రాలలోని అనేక ప్రాంతాల్లో ముఠా సభ్యులు చలామణీ చేసినట్టు పోలీసులు గుర్తించారు.…
ఉత్తరాఖండ్‌లో దారుణం చోటుచేసుకుంది. ఉదమ్ సింగ్ నగర్‌లోని సితార్ గంజ్‌లో 18 ఏళ్ల యువతి తనను అంకుల్ అని పిలిచిందని 35 ఏళ్ల వ్యక్తి దాడి చేశాడు. ఖాటిమా రోడ్డులో ఉన్న ఓ స్పోర్ట్స్ దుకాణంలో 18 ఏళ్ల యువతి రాకెట్ కొనుగోలు చేసింది. అయితే ఆ రాకెట్‌కు డ్యామేజీ ఉండటంతో దానిని మార్చుకునేందుకు మళ్లీ ఆ దుకాణానికి వెళ్లింది. ఈ క్రమంలో అక్కడ పనిచేసే 35 ఏళ్ల మోహిత్ కుమార్‌ను అంకుల్ అని పిలిచింది. Read…
పంజాబ్‌లోని లుథియానాలో దారుణం వెలుగు చూసింది. చేతబడి అనుమానంతో 70 ఏళ్ల వృద్ధురాలిని 22 ఏళ్ల యువకుడు కత్తితో పొడిచి హత్య చేశాడు. వివరాల్లోకి వెళ్తే… లుథియానా శివారులోని మెహర్బన్ ప్రాంత పరిధిలోని చుహర్వాల్ గ్రామంలో ఈనెల 18న రాత్రి కౌర్ అనే వృద్ధురాలితో తల్లి, కొడుకులు ఘర్షణ పడ్డారు. ఈ నేపథ్యంలో కౌర్ ప్రార్థనల కోసం గురుద్వారాకు వెళ్తుండగా ఆ ప్రాంతంలో మాటువేసిన యువకుడు ఆమెపై కత్తితో దాడి చేశాడు. కౌర్ చేతబడి చేస్తుందన్న ఆరోపణలతో…
కొన్నిరోజులుగా విజయవాడ పోలీసులను ముప్పుతిప్పలు పెడుతున్న చెడ్డీ గ్యాంగ్ ఎట్టకేలకు చిక్కింది. గుజరాత్‌లో నిఘా వేసిన విజయవాడ పోలీసులు చెడ్డీ గ్యాంగ్‌కు చెందిన ముగ్గురు సభ్యులను అరెస్ట్ చేసి తీసుకువచ్చినట్లు తెలుస్తోంది. అరెస్ట్ అయిన వారిలో గుజరాత్‌లోని దాహోద్ జిల్లా గుల్చర్ గ్రామానికి చెందిన మడియా కాంజీమేడా, సక్ర మండోడ్, మధ్యప్రదేశ్‌కు చెందిన కమలేష్ బాబేరియా అలియాస్ కమలేష్ అలియాస్ కమ్లా జుబువా ఉన్నారు. పరారీలో ఉన్న మిగిలిన ఏడుగురి కోసం గుజరాత్‌లోనే ఉన్న మరో పోలీసుల…
మాజీ ఐఏఎస్ అధికారి లక్ష్మీనారాయణ నివాసంలో ఏపీ సీఐడీ అధికారులు సోదాలు చేపట్టారు. హైదరాబాద్‌లోని లక్ష్మీనారాయణ నివాసంలో ఈ సోదాలు కొనసాగుతున్నాయి. టీడీపీ అధినేత చంద్రబాబు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సీఎంగా ఉన్న సమయంలో.. ఆయన కార్యాలయంలో లక్ష్మీనారాయణ పనిచేశారు. తన పదవీ విరమణ తర్వాత.. చంద్రబాబు 2014లో సీఎంగా బాధ్యతలు చేపట్టిన అనంతరం ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ సంస్థ ద్వారా లక్ష్మీనారాయణ సేవలందించారు. యువకులకు శిక్షణ ఇచ్చే క్రమంలో లక్ష్మీనారాయణ పలు అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపణలు వచ్చాయి.…
తిరుపతిలో కొందరు దుండగులు ఏటీఎంల ట్యాంపరింగ్‌లకు పాల్పడుతున్నారు. ఏటీఎంలలో ట్యాంపరింగ్ చేసి రూ.70 లక్షలు కాజేసిన ఇద్దరు దొంగలను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి పలు బ్యాంకులకు చెందిన 99 ఏటీఎం కార్డులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తిరుపతి రామానుజం కూడలిలోని ఎస్‌బీఐ ఏటీఎంలో ట్యాంపరింగ్ జరిగిందని ఈనెల 2న బ్యాంకు మేనేజర్ ఫిర్యాదు చేసినట్లు తిరుపతి అర్బన్ ఎస్పీ వెంకటఅప్పలనాయుడు తెలిపారు. Read Also: నిరుద్యోగులకు గమనిక.. ఈనెల 23 నుంచి 9,328 పోస్టుల…
హైదరాబాద్ రాజేంద్రనగర్‌లో దారుణం చోటుచేసుకుంది. ఇమాద్‌నగర్‌లో నిద్రిస్తున్న భార్యను గొంతుకోసి ఓ భర్త అతి కిరాతకంగా హత్య చేశాడు. అనంతరం భార్య తలను తీసుకుని పోలీస్ స్టేషన్‌కు వెళ్లి పోలీసుల ముందు లొంగిపోయాడు. వివరాల్లోకి వెళ్తే… 14 ఏళ్ల క్రితం సమ్రీన్ బేగం అనే అమ్మాయిని ఫర్వేజ్ అనే వ్యక్తి వివాహం చేసుకున్నాడు. అయితే భర్త వేధింపులు తాళలేక సమ్రీన్ బేగం గతంలోనే విడాకులు తీసుకుంది. ఈ నేపథ్యంలో భార్యకు నచ్చజెప్పి గత ఏడాది సమ్రీన్ బేగంను…
దేశవ్యాప్తంగా సంచలనం రేపిన హెలికాప్టర్ ప్రమాదం జరిగిన ప్రాంతంలో భయానక పరిస్థితులు నెలకొన్నాయి. చాపర్ ఎలా కూలింది, కారణాలేంటి అనేది అన్వేషణ కొనసాగుతోంది.
స్మార్ట్ ఫోన్ల వలన ఎంతోమంది తప్పుదారి పడుతున్నారు. చిన్నా, పెద్ద అని తేడా లేకుండా అందరు స్మార్ట్ ఫోన్లకు అడిక్ట్ అవుతున్నారు. ఇక ఇటీవల కరోనా వలన పిల్లలందరికీ స్మార్ట్ ఫోన్లు అవసరంగా మారిపోవడంతో తల్లిదండ్రులు సైతం వారికి ఫోన్లను కొనిస్తున్నారు . అయితే వారు మాత్రం ఫోన్ లను చదువుకోవడానికి కాకుండా గేమ్స్ కోసం, అశ్లీల వీడియోలను చూడడానికి ఉపయోగిస్తున్నారు. తాజాగా ఒక 13 ఏళ్ల బాలుడు అశ్లీల వీడియోలకు అలవాటు పడి మూడేళ్ల బాలికపై…