Bitfinex Hacking case: ఛేదించిన పోలీసులు.. అదుపులో జంట
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సంచలనం కలిగించిన బిట్‌ఫినిక్స్ హ్యాకింగ్ కేసు కొలిక్కి వచ్చింది. 2016 బిట్‌ఫినిక్స్ హ్యాకింగ్ కేసును పోలీసులు ఛేదించారు. దాదాపు ఐదేళ్ల తర్వాత ఈ కేసు ఓ కొలిక్కి వచ్చింది. 3.6 బిలియన్ డాలర్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితులు ఇలియా లిక్టెన్‌స్టెయిన్, హీథర్ మోర్గాన్ జంటను కటకటాల వెనక్కి పంపారు అమెరికా జస్టిస్ డిపార్ట్‌మెంట్ అధికారులు.
2016లో హాంకాంగ్‌కు చెందిన బిట్‌ఫినెక్స్ అనే బిట్‌కాయిన్ ఎక్స్‌ఛేంజిలో హ్యాకింగ్ జరిగింది. ఆ సమయంలో లక్షా19వేల 754 బిట్‌కాయిన్లను హ్యాకర్లు అపహరించారు. ఇందుకోసం దాదాపు 2వేల లావాదేవీలు జరిపారు. అప్పట్లో ఈ బిట్‌కాయిన్ల విలువ 71 మిలియన్ డాలర్లు.. కాగా ప్రస్తుతం వాటి విలువను 4.5 బిలియన్ డాలర్లుగా లెక్కగట్టారు. ఇలియా లిక్టెన్‌స్టెయిన్ ఆధీనంలోని ఓ డిజిటల్ వాలెట్‌కు ఇవి చేరాయి. వీటిల్లో 25వేల బిట్‌కాయిన్లతో వేర్వేరు ఖాతాలతో లావాదేవీలు జరిపారు.
Also Read
- France: విద్యార్థుల నిరసనలతో అట్టుడుకుతున్న ఫ్రాన్స్.. ఆస్తుల ధ్వంసం
- Smit Machchhar: స్మిత్ మచ్చర్‌కు అరుదైన గౌరవం.. అమెరికా ప్రతినిధుల సభలో తీర్మానం
- Israel-Gaza: ఇజ్రాయెల్-గాజా యుద్ధానికి రేపటితో మూడేళ్లు.. ఇప్పుడెలా ఉందంటే..!
- Pakistan-UN: కాశ్మీర్ సమస్య పరిష్కరించండి.. యూఎన్ ముందు పాక్ మళ్లీ దౌత్యం
తాజాగా అధికారులు మిగిలిన 94వేలబిట్‌కాయిన్లను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ 3.6 బిలియన్ డాలర్లుగా చెబుతున్నారు. అమెరికా జస్టిస్ డిపార్ట్‌మెంట్ చరిత్రలోనే ఇదో రికార్డు. ఈ బిట్‌కాయిన్లను కొన్నాళ్లు ఆల్ఫాబే అనే డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లో ఉంచారు. ఆ తర్వాత వీటిని మార్చారు.
అయితే ఈ హ్యాకింగ్ వ్యహారం దాదాపు ఐదేళ్ల తర్వాత ఓ కొలిక్కి వచ్చింది. ఈ కేసులో సుమారు 27వేల కోట్లును స్వాధీనం చేసుకున్నారు. నిందితులు ఇలియా లిక్టెన్‌స్టెయిన్, హీథర్ మోర్గాన్ జంటను అరెస్టు చేశారు అమెరికా జస్టిస్ డిపార్ట్‌మెంట్ అధికారులు. వీరు పైకి బిజినెస్‌మెన్లు, సోషల్‌మీడియా ఇన్ఫ్లుయెన్సర్లుగా చలామణి అవుతున్నారు. చోరీ చేసిన బిట్‌కాయిన్లను లాండరింగ్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారనే అభియోగాలు మోపారు అధికారులు.
తాజావార్తలు
-
Shai Hope: భారత్‌ను ఎదుర్కోవాలంటే ఆ స్కోర్ సరిపోదు.. ఓటమికి ప్రధాన కారణం ఇదే: వెస్టిండీస్ కెప్టెన్
-
Earthquake : ఉత్తరాఖండ్‌లో భూకంపం.. ఢిల్లీ-ఎన్సీఆర్ వరకు ప్రకంపనలు!
-
Shreyas Iyer: సెంచరీతో శ్రేయాస్ అయ్యర్ వీర విహారం.. వెస్టిండీస్ చిత్తు చిత్తు.. భారత్ ఘన విజయం..
-
Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
-
Team India New Captain: బీసీసీఐ సంచలన నిర్ణయం.. భారత మహిళా జట్టుకు కొత్త కెప్టెన్ ప్రకటన..
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!