Union Government: గత ఏడాది సంభవించిన విపత్తులు, వరదలకు సంబంధించిన సాయాన్ని కేంద్ర ప్రభుత్వం ఈరోజు (ఫిబ్రవరి 19) ప్రకటించింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన ఏర్పాటైన ఉన్నత స్థాయి కమిటీ ఐదు రాష్ట్రాలకు రూ.1554.99 కోట్ల అదనపు సాయాన్ని ఆమోదించింది.
ఢిల్లీలో ప్రధాని మోడీని యూకే మాజీ ప్రధాని రిషి సునక్ కుటుంబ సభ్యులు కలిశారు. ఈ సందర్భంగా మోడీతో రిషి సునక్ ప్రత్యేకంగా చర్చించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను మంగళవారం మోడీ సోషల్ మీడియాలో పంచుకున్నారు
డొనాల్డ్ ట్రంప్ భారత్‌ను ఉద్దేశించి మాట్లాడుతూ.. అసలు ‘ఇండియాకు 21 మిలియన్ డాలర్ల సాయం ఎందుకివ్వాలి అని ప్రశ్నించారు. వాళ్ల దగ్గరే చాలా డబ్బులు ఉన్నాయని పేర్కొన్నారు. అమెరికాపై వాళ్లు భారీగా ట్యాక్సులు వేస్తున్నారని ఆరోపించాడు. నాకు భారత దేశం అన్నా, ఆ దేశ ప్రధాని అన్నా గౌరవం ఉంది అని చెప్పుకొచ్చాడు.
Union Cabinet: ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన ఈ రోజు (ఫిబ్రవరి 19) కేంద్ర మంత్రి మండలి సమావేశం జరగనుంది. ఈ సమావేశం ఉదయం 10 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ భేటీలో కేంద్రం పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని టాక్.
కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్‌గా జ్ఞానేష్ కుమార్‌ను అర్ధరాత్రి నియమించడంపై లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తీవ్రంగా తప్పుపట్టారు. కొత్త సీఈసీ ఎంపిక కమిటీలో భారత ప్రధాన న్యాయమూర్తిని తొలగించడం ద్వారా సుప్రీంకోర్టు ఆదేశాన్ని ఉల్లంఘించడమేనని విమర్శించారు.
New CEC Gyanesh Kumar: ప్రస్తుతం ఎన్నికల కమిషనర్‌గా ఉన్న జ్ఞానేశ్ కుమార్.. భారత 26వ ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ)గా ఎంపికయ్యారు. అతడి స్థానంలో ఎన్నికల కమిషనర్‌గా.. ప్రస్తుతం హర్యానా సీఎస్ గా విధులు నిర్వర్తిస్తున్న వివేక్ జోషి (1989 బ్యాచ్ ఐఏఎస్)ని నియమించారు.
రెండు రోజుల భారతదేశ పర్యటన నిమిత్తం సోమవారం సాయంత్రం ఖతార్ అమీర్ షేక్ తమీమ్ బిన్ హమద్ అల్-థానీ ఢిల్లీ చేరుకున్నారు. ఆయనకు స్వాగతం పలికేందుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సోమవారం విమానాశ్రయానికి వెళ్లి అరుదైన ఆతిథ్యాన్ని అందించారు. ఖతార్ అమీర్‌ను ప్రధాని మోడీ ఆలింగనం చేసుకుని స్వాగతం పలికారు.
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చి దాదాపు 10 రోజులైంది. 27 ఏళ్ల తర్వాత బీజేపీ అధికారాన్ని చేజిక్కించుకుంది. కానీ ఇప్పటి వరకు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేదు.
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చి 9 రోజులైంది. ఫిబ్రవరి 8న వెలువడిన ఎన్నికల ఫలితాల్లో బీజేపీ భారీ విజయాన్ని అందుకుంది. 27 ఏళ్ల తర్వాత కాషాయ పార్టీ అధికారాన్ని చేజిక్కించుకుంది.