Tahawwur Rana: 26/11 ముంబై ఉగ్రదాడుల్లో నిందితుడిగా ఉన్న తహవ్వూర్ రాణాని భారత్‌కి అప్పగించేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆమోదం తెలిపారు. వైట్ హౌస్‌లో ద్వైపాక్షిక సమావేశం తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో కలిసి జరిగిన సంయుక్త విలేకరుల సమావేశంలో ఆయన ఈ ప్రకటన చేశారు.
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించింది. 27 ఏళ్ల తర్వాత కాషాయ పార్టీ అధికారాన్ని చేజిక్కించుకుంది. అయితే ఫలితాలు వచ్చి 6 రోజులు అవుతున్నా.. ఇప్పటిదాకా ముఖ్యమంత్రి ఎంపిక జరగలేదు.
PM Modi : ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రెండు రోజుల పర్యటన కోసం అమెరికా చేరుకున్నారు. వాషింగ్టన్లో ప్రధానికి ఘన స్వాగతం లభించింది. తన పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో సమావేశమవుతారు.
India Bangladesh: షేక్ హసీనా ప్రధాని పదవికి రాజీనామా చేసి, భారత్ పారిపోయి వచ్చిన తర్వాత బంగ్లాదేశ్ వ్యాప్తంగా భారత వ్యతిరేకత పెరుగుతోంది. ప్రస్తుతం తాత్కాలిక ప్రభుత్వాధినేతగా ఉన్న మహ్మద్ యూనస్ భారత్‌తో మెరుగైన సంబంధాలు కోరుకునే పరిస్థితి కనిపించడం లేదు. ఆయన సర్కార్‌లోని విద్యార్థి నేతలు, జమాతే ఇస్లామీ, బీఎన్పీ పార్టీలకు చెందిన నేతలు మతోన్మాద వ్యాఖ్యలు చేస్తూ, అక్కడి ప్రజల్ని రెచ్చగొడుతున్నారు. హిందువులు, భారత్‌కి వ్యతిరేకంగా ప్రజల్లో విషబీజాలు నాటుతున్నారు. మరోవైపు బంగ్లాదేశ్ తనకు…
Savarkar: ప్రధాని నరేంద్రమోడీ రెండు రోజలు పర్యటన కోసం ఫ్రాన్స్ వెళ్లారు. ఈ రోజు మార్సెయిల్ నగరంలో భారత కాన్సులేట్‌ని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మక్రాన్‌తో కలిసి ప్రారంభించారు.
ఫ్రాన్స్‌లో ప్రధాని మోడీ పర్యటన కొనసాగుతోంది. పర్యటనలో భాగంగా బుధవారం దక్షిణ ఫ్రాన్స్‌లోని మార్సెయిల్‌కు చేరుకున్నారు. స్మశానవాటికలో ప్రపంచ యుద్ధాల సమయంలో విదేశీ భూములను రక్షించడంలో అంతిమ త్యాగం చేసిన భారతీయ సైనికుల జ్ఞాపకార్థం నిర్మించిన స్మశానవాటికలో ప్రధాని మోడీ నివాళులర్పించారు.
ప్రధాని మోడీ ఫ్రాన్స్‌లో పర్యటించారు. మంగళవారం ఏఐ సమ్మిట్ జరిగింది. ఈ సమ్మిట్‌కు ప్రధాని మోడీ అధ్యక్షత వహించారు. ఇక పర్యటనలో భాగంగా ప్రధాని మోడీ.. మంగళవారం సాయంత్రం అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, ఆయన సతీమణి ఉషా వాన్స్‌తో సమావేశమయ్యారు.
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ భారీ విజయాన్ని అందుకుంది. 27 ఏళ్ల తర్వాత కాషాయ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. తిరిగి లేని మెజార్టీని కమలం పార్టీ అందుకుంది. అయితే ఇప్పటి వరకు ముఖ్యమంత్రి ఎంపిక జరగలేదు. ఈ విషయంలో కమలనాథులు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్లుగా కనిపిస్తోంది.
ప్రధాని మోడీ ఫ్రాన్స్‌లో పర్యటిస్తు్న్నారు. నాలుగు రోజుల విదేశీ పర్యటన కోసం సోమవారం ఢిల్లీ నుంచి ఫ్రాన్స్‌కు బయల్దేరి వెళ్లారు. పారిస్‌లో ప్రధాని మోడీకి ఘనస్వాగతం లభించింది.
PM Modi: ప్రధాని నరేంద్రమోడీ తన అమెరికా పర్యటనకు ముందు కీలక సందేశం ఇచ్చారు. ఫిబ్రవరి 12, 13 తేదీల్లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో మోడీ భేటీ కానున్నారు. ఈ నేపథ్యంలో ..‘‘ నా మిత్రుడు డొనాల్డ్ ట్రంప్‌ని కలవడానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నా’’ అని ఎక్స్‌లో ట్వీట్ చేశారు. ట్రంప్ మొదటి పదవీకాలంలో నిర్మించబడిన ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేయడాని పర్యటన సహకరిస్తుందని మోడీ అన్నారు. ప్రధాని మోడీ ముందుగా మూడు రోజుల పర్యటన…